లక్నో: యూట్యూట్ ఛానల్ వీడియో చిత్రీకరణ కోసం ప్రొఫెషనల్ బైకర్ అగస్త చౌహాన్ గంటకు 300 కిలో మీటర్ల వేగంతో బైక్ డ్రైవ్ చేస్తూ దుర్మరణం చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్ వేపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అగస్త చౌహాన్ అనే బైకర్ ఢిల్లీలో జరిగినే బైక్ రేసింగ్‌లకు ఆగ్రా నుంచి తన జడ్‌ఎక్స్ 10 ఆర్ నింజా సూపర్ బైక్‌పై బయలు దేరాడు. తన యూట్యూబ్ ఛానల్ కోసం 300 కిలో మీటర్ల వేగంతో బైక్‌ను నడుపుతుండగా టప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యమునా ఎక్స్‌ప్రెస్ వేపై పాయింట్ 46 వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తలకు ధరించిన హెల్మెట్ ముక్కలు కావడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అగస్త్యా ఘటన స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడి స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్. ఆయన ‘ప్రో రైడర్’ అనే యూట్యూబ్ చానల్ నడిపిస్తున్నాడు. ఈ యూట్యూబ్ చానల్‌కు 1.2 మిలియన్ సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు.
Also Read: కాళికాదేవి అమ్మవారికి అవమానం: ఉక్రెయిన్ క్షమాపణలు