Sunday, December 22, 2024

సింహంతో ‘తాడు లాగుడు’… చివరికి ఏమైందంటే! (వీడియో)

- Advertisement -
- Advertisement -

రాజమౌళి ‘యమదొంగ’ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ ఒకటుంది. ‘పులిని దూరంనుంచి చూడాలనిపించిందనుకో… చూస్కో. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో… కొంచెం రిస్కయినా ఫర్లేదు ట్రై చేసుకోవచ్చు. సరే చనువిచ్చిది కదాని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’ అని ఎన్టీఆర్ చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్ అయింది. నిజ జీవితంలో కూడా కొందరు చనువు తీసుకోబోయారు. కానీ పులితో కాదు… సింహంతో. చివరకి వారికి పరాభవం తప్పలేదు మరి!

అసలు సంగతి ఏంటంటే, బోనులో ఉన్న ఓ సింహంతో కొందరు రెజ్లర్లకు ఆటాడాలనిపించిది. బోనులో ఉన్నా సింహం సింహమే అన్న సంగతి మరచిపోయారు. బోనులోకి ఓ బలమైన తాడును విసిరారు. దాన్ని వెంటనే సింహం పట్టుకుంది. మరోవైపు తాడును నలుగురు రెజ్లర్లు పట్టుకున్నారు. టగ్ ఆఫ్ వార్ ఆట మొదలైంది. రెజ్లర్లు ఎంత బలంగా లాగినా సింహం తాడు వదల్లేదు. చివరకు రెజ్లర్లే ఓటమిని అంగీకరించి తాడును వదలేసి, సింహం బలానికి సలామ్ చేశారు! ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారో తెలియలేదు గానీ, ఎక్స్ లో వైరల్ అవుతోంది.

ఇలాంటిదే మరొక వీడియోలో బలిష్టంగా ఉన్న ఒక బెల్జియం గుర్రానికి తాడును కట్టి దాంతో పదిహేనుమంది వరకూ టగ్ ఆఫ్ వార్ ఆడారు. అయితే ‘హార్స్ పవర్’ ముందు వారి బలం ఏమాత్రం చాలలేదు. ఈ వీడియో కూడా నెటిజన్ల ఆదరణ పొందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News