న్యూయార్క్ : ప్రొఫెసర్ బిమల్ పటేల్ అంతర్జాతీయ న్యాయ సంఘం (ఐఎల్‌సి) సభ్యులుగా హోరాహోరిగా జరిగిన పోటీలో ఎన్నికయ్యారు. ప్రొఫెసర్ బిమల్ పటేల్ భారత్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్శిటీ వైస్ ఛానల్సర్‌గా ఉన్నారు. అంతేకాకుండా నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజరీ బోర్డు సభ్యులు కూడా. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఐఎల్‌సికి తీవ్రస్థాయిలో పోటీ జరిగింది. అయిదేళ్ల పాటు పటేల్ ఐఎల్‌సి సభ్యులుగా ఉంటారు. ఐరాస సర్వప్రతినిధి సభకు చెందిన 192 మంది సభ్యులు హాజరై ఓటింగ్‌లో పాల్గొన్నారు. పటేల్‌కు 163 ఓట్లు వచ్చాయి. ఈ విధంగా చైనా, దక్షిణ కొరియా, జపాన్ అభ్యర్థులు కూడాబరిలో నిలిచిన ఈ ఆసియా పసిఫిక్ గ్రూప్ స్థాయి ఎన్నికల్లో భారతీయ అభ్యర్థికి అత్యధిక ఓట్లు పడ్డాయి. ఐఎల్‌సికి అత్యధిక మెజార్టీతో ఎన్నికైనందుకు తమ హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నట్లు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ త్రిమూర్తి తెలిపారు.
న్యాయసంఘానికి బిమల్ పటేల్ ఘన ఎన్నిక
- Advertisement -
- Advertisement -
- Advertisement -