Monday, January 20, 2025

గిరిజన సంక్షేమ శాఖలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ కలలను సాకారం చేయుటకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది పునరంకితం కావాలని ఆ శాఖ అడిషనల్ డైరెక్టర్ వి. సర్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్‌లో ఆదివారం జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఆశయాన్ని ఉపిరిగా కలిగి వ్యక్తిగత జీవితాన్ని ,పెళ్లిని త్యాగం చేసి అహర్నిశలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉన్నత నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ అని సర్వేశ్వర్ రెడ్డి కొనియాడారు.

గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ జనరల్ మేనేజ్ సీతారాం నాయక్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర చాలా ఉందని ఇంకా ఎక్కువ శ్రమించి గిరిజనాభివృద్ధికి తోడ్పడాలన్నారు. అనంతరం ఆయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గీతం పాడి వినిపించారు. గిరిజన సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ డా. పి. కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలైన గిరిజనుల అభివృద్ధికై పాటుబడే అవకాశం గిరిజన శాఖ సిబ్బందికే దక్కిందని గిరిజనుల అభివృద్ధికై ఇంకా ఎక్కువ క్రమించి ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను సాధించాలన్నారు. గిరిజన సాంస్కృతిక పరిశోధన,శిక్షణా సంస్థ జాయింట్ డైరెక్టర్ డా. వి. సముజ్వల మాట్లాడుతూ మా వనరులు మాకున్నాయి. ‘మా వనరులపై మాకు అధికారం కావాలి, యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి!! ‘ అని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్షను నినదించారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే లోపే ఆయన పరమపదించడం బాధాకరమని ఆయన అంత్య క్రియలకు ఓరుగల్లులో లక్షల మంది హాజరు అయి తమ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవశ్యకతను తెలియజేశారని అన్నారు.

గిరిజన సంక్షేమ ఓఎస్‌డి. జి యాదయ్య మాట్లాడుతూ ప్రాసెసర్ జయశంకర్ ప్రజలందరినీ ఏకతాటిపై తెచ్చి కెసిఆర్ కు గురువుగా సలహాలు ఇచ్చి అమెరికా, దేశ విదేశాలలో పర్యటించి రాష్ట్రం కొరకు పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ లు శంకర్, ప్రియాంక, మసూద్, క్రీడాధికారిణి జ్యోతి ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ప్రొసెసర్ జయశంకర్ ఫోటోకు పూలమాల వేసి స్మరించుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News