Monday, December 23, 2024

ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లిలోని ఎల్లమ్మబండలో ఓ వ్యక్తి దుశర్య

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెలంగాణ సమాజం గౌరవించే వ్యక్తి విగ్రహం ధ్వంసం చేయడం దారుణం,

నిందితుడిని కఠినంగా శిక్షించాలి : బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్

మనతెలంగాణ/హైదరాబాద్ : నగర శివారులోని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాల నీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ మెయిన్ రోడ్ లో ఉన్న తెలంగాణ సిద్ధ్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశారు. మం గళవారం ఉదయం మద్యం మత్తులో ఉన్న మహావీర్ కాలనీకి చెందిన గోవింద్ అనే వ్యక్తి అల్వీన్ కాలనీ చౌరస్తాలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ వి గ్రహాన్ని రాయితో గద్దెపై నుండి కిందకి తోసేశా డు. అనంతరం పక్కనే ఉన్న రాయితో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ తంతును స్థానికులు, వాహనదారులు చూస్తూనే ఉన్నా ఎవరూ అడ్డుకునే ప్ర యత్నం చే యలేదు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకు న్న పెట్రోలింగ్ పోలీసులు గోవింద్‌ను అదుపులో కి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించా రు. కాగా, ఈ ఘటనను స్థానికులు వీడియో తీ యగా కాసేపటికే అది వైరల్‌గా మారింది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల తెలంగాణ ఉద్యమకారులు ఘటన స్థలానికి చేరుకుని ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి : కెటిఆర్
ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ సమాజం ఎం తగానే గౌరవించే వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయ డం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డిజిపి రవి గుప్తాను ఎక్స్(ట్విట్టర్) ద్వారా డిమాండ్ చేశారు.
ఇదేనా కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు : దాసోజు శ్రవణ్
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం పట్ల బిఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమైన చర్య అని పేర్కొన్నారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఆంధ్ర నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయలేదని… తొలగించలేదని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీగానీ, కెసిఆర్ ప్రభుత్వం గానీ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని తెలిపారు. కానీ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇదేనా కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు అని మండిపడ్డారు. జయశంకర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. విగ్రహం ధ్వంసం చేసిన చోటులో మళ్లీ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర డిజిపి, సైబరాబాద్ సిపి, జిహెచ్‌ఎంసి కమిషనర్లను దాసోజు శ్రవణ్ కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News