Wednesday, January 22, 2025

కెసిఆర్‌కు దిశా నిర్దేశం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్

- Advertisement -
- Advertisement -

నల్గొండ:ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషిని, దృఢ సం ఉన్కల్పాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలోని మీ సేవ కేం ద్రం పక్కన గల ఆచార్య కొత్తపెళ్లి జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో కెసిఆర్కు దిశా నిర్దేశం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరగాల్సిన పనుల గురించి కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ తో అనేక చర్చోప చర్చలు గావించారు అని తెలిపారు. అందులో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులు బాగుండాలని అందుకోసం 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు.

అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు బాగుపడేలా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News