Monday, December 23, 2024

నిరుద్యోగులకు భవిష్యత్తు మీద నమ్మకం లేదు

- Advertisement -
- Advertisement -

హనుమకొండటౌన్ : టిఎస్‌పిఎస్‌సి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, ప్రశ్నపత్రాల లీకేజీ వర్తమాన తెలంగాణకు సాక్షిగా నిలుస్తోందని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలో హరిత కాకతీయ హోటల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల వేదికపై తెలంగాణ బచావో సదస్సు నిర్వహించారు. ఈకార్యక్రమం ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ సభ అధ్యక్షతన నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఐఎఎస్ ఆకునూరి మురళి, ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి, అరుణోదయ విమలక్క, సంగంరెడ్డి పృథ్వీరాజ్‌యాదవ్, తొలివెలుగు రఘు, తెలంగాణ విఠల్, టిఎస్ ఐఎంఎ ప్రెసిడెంట్ డాక్టర్ కాళీప్రసాద్, అకుట్ అధ్యక్షులు ప్రొఫెసర్ టి.శ్రీనివాస్‌లు పాల్గొని ప్రసంగించారు.

ఈసందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. టిఎస్ పిఎస్‌సి ప్రశ్నాపత్రాల లీకులకు టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌ను బాధ్యునిగా చేస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు. లీకేజీ కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పాలకుల పనితీరుతో నిరుద్యోగులకు భవిష్యత్తు మీద నమ్మకం పోయిందని, రాష్ట్రంలో అధికారాన్ని వాడుకొని వ్యాపారాలు చేస్తున్నారన్నారు. నియామకాల పేరున లీకేజీల వ్యాపారం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం లాంటివి చేపడితే అవన్నీ తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. అనంతరం అకునూరి మురళి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు రూ.16 లక్షల కోట్ల సంపద ఖర్చు అయిందన్నారు.

సింగపూర్ లాంటి దేశంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ కాని సింగపూర్ కన్నా 100 రెట్ల సంపద తెలంగాణలో ఉందన్నారు. అనంతరం విమలక్క మాట్లాడుతూ.. తెలంగాణకు పోరాటం ఆరాటం కొత్త కాదని, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ప్రజానీకమంగా ఏకమై ఉద్యమ చేపడితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని అలాంటి తెలంగాణను కెసిఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఈకార్యక్రమంలో పుల్లూరు సుధాకర్, అడ్వకేట్ అంబటి శ్రీనివాస్, ఇడంపాక విజయ్‌కన్నా, డాక్టర్ కె.వీరస్వామి, గుగులోతు రాజునాయక్, మేడ రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News