Wednesday, January 22, 2025

తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ విసిగా ప్రొఫెసర్ ఎం. విజ్జులత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ ఎం. విజ్జులత నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఎం. విజ్ఞులత,ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్. లింభాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్‌లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని ఆమె నివాంసలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండేలా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కృషి చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ ఎం. విజ్జులత నియామకం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని మంత్రి ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్‌కు సూచించారు. ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వర్సిటీ అవసరాలు, ఇతర పరిస్థితులకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి సూచించారు. బోధనా సౌకర్యాలు, విద్యార్థినులకు కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News