Friday, January 24, 2025

మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావుతో జెడ్డా భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పర్యటన చేపట్టి పార్టీని బలోపేతం చేసిన కార్యకర్తల్లో ఉత్సహం నింపేందుకు ప్రయత్నాలు వేగం చేశారు. అందులో భాగంగా ఆదివారం నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన నడ్డా హైదరాబాద్ చేరుకున్న తెలంగాణలో పార్టీ తాజా పరిస్థితులపై రాష్ట్ర నేతలతో చర్చించారు. అనంతరం సంపర్క్ సే సంవర్ధన్‌లో భాగంగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, నృత్యకారణి ఆనంద శంకర్ జయంత్‌తో విడివిడిగా సమావేశం నిర్వహించారు.

మొదట జెపి నడ్డా ప్రొపెసర్ నాగేశ్వర్‌రావుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆయన వెంట ఎంపీ లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు. అనంతరం నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ నరేంద్రమోడీ 9 ఏళ్ల పాలన గురించి నడ్డా వివరించారని, ప్రజాస్వామ్యంలో చర్చలు జరపడం సంప్రదామని చెప్పారు. తాము పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామని, అనేక అంశాలపై మాట్లాడుకున్నామని వెల్లడించారు. ఈక్రమంలోనే జెపి నడ్డా, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా నడ్డా ఫిల్మ్‌నగర్‌లోని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్ జయంత్‌ను కలిశారు. ప్రధాని మోడీ పాలన విజయాలను వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పుస్తకాలను ఆమెకు అందజేశారు. ఇటీవలే మన్‌కీబాత్ లో ఆనంద్ శంకర్ పేరును మోదీ ప్రస్తావించారని చెప్పారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ బృందం చేసిన నృత్యాన్ని వీక్షించారని చెప్పారు. క్లాసికల్ డ్యాన్స్‌కు సంబంధించిన పుస్తకాలను కూడా తాము జెపి నడ్డాకు అందజేసినట్లు జయంత్ తెలిపారు. పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటలను చేయడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News