Tuesday, November 5, 2024

ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రమాదేవికి ఫార్మాస్యూటికల్ సైన్స్‌లో డాక్టరేట్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : గోదావరిఖనికి చెందిన కాత్యం రమాదేవి ఉస్మానియా యూనివర్శిటీ ఫార్మసి విభాగంలో డాక్టరేట్‌ను పొందారు. మైక్రోవేవ్ ఆస్సిస్టేడ్ సింథసిస్ ఆఫ్ నైట్రోజన్‌హెటిరోసైక్లిక్ కంపౌండ్స్ అండ్ ఎవ్వాల్యువేష్ ఆప్ థియరీ ఫార్మాకాలజికల్ ఆక్టివిటీస్ అనే అంశంపై పరిశోధన గ్రందాన్ని యూనివర్శిటికి సమర్పించారు. ప్రొఫెసర్ కె.ఎస్,కే రావ్ పట్నాయక్, ప్రొఫెసర్ డి.అశోక్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమెస్ట్రీ మార్గదర్శకంలో పని చేస్తూ ఆమె ఈ ఘతను సాధించారు. ఈ సందర్భంగ రమాదేవి మాట్లాడుతూ తల్లి పర్స సరస్వతి,తండ్రి క్యాతం జాన్ వెస్లీ కోరిక మేరకు తాను ఈ ఘనతను సాధించినట్లు చెప్పారు. తాను చేసిన పరిశోధనలు జాతీయ,అంతర్జాతీయ గుర్తింపు పొందినట్లు చెప్పారు. డాక్టరేట్ సాధించడంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తన భర్త డాక్టర్ రాజు బత్తుల, చెల్లి రమ్మశ్రీ, తమ్ముడు ప్రవీణ్ ,క్యాతమ్ కటుంబ సభ్యులు,మిత్రులు,అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News