Monday, January 20, 2025

సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీలో శనివారం ఉదయం  దారుణం వెలుగులోకి వచ్చింది. థాయిలాండ్ కి చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారం చేయబోయాడు. విద్యార్థిని తృటిలో తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… థాయ్‌లాండ్ చెందిన విద్యార్థిని హెచ్‌సియులోని హిందీ డిపార్ట్‌మెంట్‌లో స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ చదువుతోంది. అదే డిపార్ట్‌మెంట్‌లో రవి రంజన్ హిందీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి సదరు విద్యార్థినిపై రవి రంజన్ కన్నేశాడు. ఆమెపై అత్యాచారం చేస్తుండగా తప్పించుకుంది. తొటి విద్యార్థులకు తెలపడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  ఈ సంఘటన విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీచక ప్రొఫెసర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్ పాడు పనులు చేస్తే ఎలా? అని విద్యార్థులు మండిపడుతున్నారు. ప్రతి చోటు మహిళలకు రక్షణ లేకుండాపోయిందని వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News