Wednesday, October 16, 2024

ప్రొఫెసర్ సాయిబాబా మరణం సమాజానికి తీరని లోటు

- Advertisement -
- Advertisement -

ఆయన మరణానికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత
జైలులో మంచినీళ్లు తాగే అవకాశం కూడా ఇవ్వలేదు
సాయిబాబా సతీమణి కుటుంబ సభ్యులను పరామర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్, మానవ హక్కుల ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా మృతికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మరణం సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. సాయిబాబా మరణవార్త తెలిసిన అనంతరం సాంబశివరావు ఆదివారం సాయంత్రం ఆయన నివాసానికి వెళ్ళి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సతీమణి వసంతను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలకొండ కాంతయ్య, మారుపాక అనిల్ టిపిఎఫ్ నాయకులు రవిచంద్ర కూడా సాయిబాబా కుటుంబ సభ్యులను పరిమర్శించారు.

ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ సాయిబాబా మరణించినా ఆయన స్పూర్తి సమాజాన్ని తట్టి లేపుతుందన్నారు. సాయిబాబా శారీరక వైకల్యం ఉన్నా సమాజం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నారన్నారు. చాలా మందిని రాజకీయంగా చైతన్య పరిచారన్నారు. మావోయిస్టులతో సంబంధం ఉన్నదనే కేసులో ముంబాయి హైకోర్టు ప్రొఫెసర్ సాయిబాబాను నిర్ధోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇవ్వడంతో ఆయన 2024 మార్చి 8న నాగ్ జైలు నుంచి కొద్దిరోజుల క్రితమే విడుదలయ్యారని గుర్తు చేశారు. సాయిబాబాపై తప్పుడు కేసులు బనాయించి, ప్రశ్నించే వారిని, సమాజం కోసం పనిచేసే వారిపై తప్పుడు కేసులు పెట్టడం అన్యాయం అన్నారు. జైలులో ఉన్న సమయంలో ప్రొఫెసర్ సాయిబాబకు మంచినీళ్లు తాగే అవకాశం కూడా ఇవ్వలేదని, ఆయన మరణించడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన మరణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. జైలులో అనేక సంవత్సరాలు ఆయనను నరక యాతన పెట్టారన్నారు. చివరకు మంచినీళ్లు తాగే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. సాయిబాబాకు బెయిల్ వచ్చినా కూడా కుంటిసాకులతో నిర్భందించడం శోచనీయమన్నారు. వరవరరావు పరిస్థితి కూడా ఇదే మదిరిగా ఉందని, హౌ జ్ అరెస్టుల పేరుతో శారీరకంగా, మానసికంగా ప్రశ్నించేవారిని అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. వామపక్షాలు అంటేనే భయపడేలా చేసే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని భయాందోళన వ్యకం చేశారు. ఇందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వరుస స్టేట్ ఇస్తున్నారని, 2026 నాటికి మావోయిస్టులను తుదముట్టిస్తామని హెచ్చరించడం వెనుక మతలబేమిటన్నారు. ఈ పేరుతో ఇటీవలే 31 మందిని, అంతకు ముందు 26 మందిని ఇలా ఏడాదిలోనే 200 మందిని ఎన్‌కౌంటర్ చేశారన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన బిజెపి రాక్షస పరిపాలన చేస్తుందని, ఇలాంటి దుర్మాగుల పరిపాలన వల్ల దేశానికి మంచి జరగదని విమర్శించారు.

ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబ మృతి
ప్రజా ఉద్యమానికి తీరని లోటు : తమ్మినేని

ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్, ఉద్యమకారుడు, జిఎన్ సాయిబాబ మృతికి సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నదని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా దేశద్రోహ నేరం మోపి 90శాతం అంగవైకల్యంతో ఉన్న సాయిబాబను మరో ఐదుగురితో కలిసి 2014 నుండి టెర్రరిస్టు నెపంతో ఉపా చట్టం క్రింద దీర్ఘకాలం జైలులో నిర్బంధించిందన్నారు. అర్బన్ నక్సలైట్‌గా ముద్రవేసిందని తెలిపారు. జైలులో వున్న సమయంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా సరైన వైద్య సౌకర్యం అందించలేదన్నారు. పదేండ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం బాంబే హైకోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు ఇవ్వడంతో మార్చి 5న విడుదలయ్యారు. బిజెపి ప్రభుత్వ విధానాలకు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. దళిత, గిరిజన, వికలాంగుల హక్కుల నేతగా, విద్యావేత్తగా పేరొందిన ఆయన మృతి ప్రజా ఉద్యమానికి తీరని లోటు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News