Saturday, December 21, 2024

వేదికపై గుండెపోటు.. ప్రొఫెసర్ సమీర్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

కాన్పూర్ : ఐఐటి కాన్పూర్ విద్యాసంస్థలో అత్యంత విషాదకర ఘటన జరిగింది. ఈ విద్యాసంస్థ సీనియర్ ప్రొఫెసర్ 55 సంవత్సరాల సమీర్ ఖండేకర్ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగిస్తున్న దశలోనే గుండెపోటుకు గురై ఆయన వేదికపైనే కుప్పకూలారు. ఆడిటోరియంలో అంతా చూస్తున్న దశలోనే కిందకు వాలాడు . మంచి ఆరోగ్యం అలవర్చుకునే విధానాల గురించి మాట్లాడుతున్నప్పుడే ఆయన విషాదాంతం జరిగింది. ఆయన చివరి మాటలు ఇవే అంతా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి’ . మృతి చెందిన ఈ ప్రొఫెసర్‌కు తల్లిదండ్రులు, భార్య పిల్లలు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూరులో జన్మించిన సమీర్ ఐఐటి కాన్పూర్‌లోనే బిటెక్ చేశారు, తరువాత జర్మనీలో పిహెచ్‌డి చేశారు. 2004లో ఐఐటి కాన్పూర్‌లోనే అధ్యాపక వృత్తిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News