Wednesday, January 22, 2025

యూనివర్సిటీలో కాల్పులు.. ప్రొఫెసర్‌ మృతి

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. చాపెల్ హిల్స్ లోని నార్త్‌ కరోలినా యూనివర్సిటీలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. సోమవారం మధ్యాహ్నం యూనివర్సిటీలోని సైన్స్ బిల్డింగ్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మృతి చెందాడు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిని విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News