Monday, December 23, 2024

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం

- Advertisement -
- Advertisement -

ఆగస్ట్టు 15వ తేదీకి ముందు 7
రోజులు, అనంతరం 7 రోజులు
మొత్తం 15 రోజులు
జెండాల తయారీకి నేత, పవర్‌లూమ్
కార్మికులకు ఆర్డర్ ఇవ్వండి
క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాల నిర్వహణ
జాతీయ భావాలను రగలించే
సాంస్కృతిక కార్యక్రమాలు
స్వాతంత్య్ర సమరయోధులు,
మహానీయుల త్యాగాల స్మరణ
ఉత్సవాలను ఘనంగా
నిర్వహించుకోవాలి
అధికారులకు కెసిఆర్ ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర స మరయోధులు, మహానీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృ తం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 75 ఏళ్ల ‘స్వతంత్య్ర భారత వజ్రోత్సవ ద్వి స ప్తాహం’ నిర్వహణకు సంబంధించి శనివారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ గడప గడపకు, వాడవాడలా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, క్రీడాపోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు, జాతీయ భావాలను రగలించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. (స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం) స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగష్టు 15వ తేదీకి ముందు 7 రోజులు అనంతరం 7 రోజులు మొత్తం 15 రోజుల పాటు రాష్ట్రం లో ‘భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ’ కార్యక్రమాలు నిర్వహించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

భారత దేశాన్ని మరింత గుణాత్మకంగా…

అటు దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణలో, దేశ స్వాంతం త్య్రం కోసం సాగిన పోరాటాలు, జరిగిన త్యాగాలు, నాటి జాతీయ నాయకులు, అమరుల వివరాలు నేటి తరానికి తెలియ చేయాల్సిన అవసరం ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. 75 ఏళ్ల కాలంలో స్వతంత్య్ర భారతం ఎన్నో ఘన విజయాలను సాధించిందన్నారు. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా భారతదేశం పరిఢవిల్లుతోందన్నారు. భారత స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాం గ నిర్మాతలు కలలుగన్న భారత దేశాన్ని మరింత గుణాత్మకంగా రూపొందించుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత దేశం భిన్న సంస్కృతులతో, విభిన్న భాషలు, మతాలు, ఆచారవ్యవహారాలు, సంప్రదాయాల తో అత్యున్నత ప్రాపంచిక సార్వజనీన విలువలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనసాగిస్తోందన్నారు. ప్రపంచ దేశా ల్లో భారతదేశానిది విలక్షణమైన సాంస్కృతిక జీవన వి ధానమని, మారుతున్న కాలంలో పెరుగుతున్న సాంకేతికత పనిఒత్తిడి, ఆర్థిక అవసరాల నేపథ్యంలో నాటితరం ఆచరించిన దేశభక్తి కానీ అంతటి భావోద్వేగం కానీ నేటి యువతలో ప్రదర్శితమవుతలేదన్నారు. ఇటువంటి వాతావరణాన్ని మనం పున:సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గడప గడపనా జాతీయ జెండా రెపరెపలు

రాష్ట్రంలోని ప్రతి ఇంటిమీద జాతీయ పతాకం ఎగురవేయాలని సిఎం సూచించారు. అందుకు అవసరమైన 1 కోటి 20 లక్షల త్రివర్ణ పతాకాల తయారీకి ఏర్పాట్లు చే యాలన్నారు. గద్వాల, నారాయణపేట్, సిరిసిల్ల, పో చంపల్లి, భువనగిరి వరంగల్ తదితర ప్రాంతాల్లోని చేనే త పవర్ లూమ్ కార్మికులకు ఆర్డర్‌లు ఇవ్వాలని సిఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయం మీద జాతీయ పతాకాన్ని అత్యున్నతంగా ఎగురవేయాలన్నారు. జాతీయ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన విధి, విధానాలను రూపొందించాలని జిఎడి అధికారులను సిఎం ఆదేశించారు. ప్రతి ప్రభు త్వ వాహనం మీద జాతీయ జెండా ఎగిరేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా జెండాలను త యారు చేయించాలన్నారు. ఇందుకోసం అవసరమయ్యే జాతీయ పతాకాల ముద్రణా ఖర్చు సహా దేశభక్తి ప్రచార కార్యక్రమాలకోసం ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని సిఎం స్పష్టం చేశారు.

అనువైన చోటల్లా దేశభక్తి స్ఫూర్తి

రాష్ట్రంలోని ప్రజా సంచార ప్రాంతాలు, బస్టాండ్లు ప్రాంగణాలు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, పట్టణాల్లోని స్టార్ హోటళ్లు సహా ప్రధాన కూడళ్లు రహదారుల వెంట అనువైన చోటల్లా దేశభక్తి స్పూర్తి జాలువారేలా జాతీయ జెండా రెప రెపలాడేలా చర్యలు చేపట్టాలని సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. ప్రజలు, ఉద్యోగుల నడుమ సత్సంబంధాలు పెంపొందించే ఫ్రెండ్లీ ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సిఎం పేర్కొన్నారు. ఉద్యోగుల్లో కూడా దేశభక్తిని రగిలించే సాంస్కృతిక, సా హిత్య కార్యక్రమాలతో పాటు మండల జిల్లా రాష్ట్ర స్థాయి ల్లో ఫ్రీడం రన్‌లను నిర్వహించాలని సిఎం సూచించారు.

వజ్రోత్సవ దీప్తిని వెలిగించండి

పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల సారథ్యంలో పల్లె నుంచి పట్నం దాకా స్వాతంత్య్ర వజ్రోత్సవ దీప్తిని వెలిగించే విధంగా తగిన చర్యలు చేపట్టాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. తెలంగాణ నుంచి, దేశంలోని పలు ప్రాంతాలనుంచి, దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న నాటితరం జాతీయ నాయకుల వివరాలు విద్యాసంస్థల్లో విద్యార్థులకు యువత కోసం అర్థమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

విద్యాసంస్థల్లో….

పీజీ, డిగ్రీ జూనియర్ కళాశాలలు సహా గురుకులాలు తదితర ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు సహా అన్ని రకాల విద్యాసంస్థల్లో పంద్రాగస్టుకు ముందు వారం రోజులు, పంద్రాగస్టుకు తర్వాత వారం రోజులు మొత్తం 15రోజుల పాటు నిర్వహించబోయే ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమాల గురించి సిఎం కెసిఆర్ అధికారులకు వివరించారు. ఇందులో ఆటల పోటీలు, వ్యాస రచన పోటీలు, వకృత్వ పోటీలు, చిత్రలేఖనం పోటీలు, దేశభక్తిగీతాల పోటీలు, నాటికలు, ఏకపాత్రాభినయం తదితర దేశభక్తిని పెంపొందింప చేసే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ చేపట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి, కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

విధి, విధానాల కోసం కమిటీ ఏర్పాటు

అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ కార్యక్రమాల్లో పోలీసు సహా అన్ని ప్రభుత్వ శాఖలు పాల్గొనాలని సిఎం సూచించారు. ఆయా శాఖల ఉద్యోగులు పదిహేను రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల రోజువారీ షె డ్యూల్‌ను రూపొందించుకొని రెండు వారాల పాటు అమలు చేయాలని సిఎం పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విధి, విధానాల రూపకల్పన కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని సిఎస్ సోమేశ్ కుమార్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.

లెటర్ హెడ్‌ల మీద జాతీయ పతాక చిహ్నాం

ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా సర్పంచ్ స్థాయి ప్రజా ప్రతినిధులతో పాటు, ప్రభుత్వ కార్యదర్శులు సహా ఉన్నతాధికారులు వారి వారి లెటర్ ప్యాడ్లమీద జాతీయ జెండా బొమ్మను ముద్రించుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు.

మీడియా యాజమాన్యాలకు విజ్ఞప్తి..

పదిహేను రోజుల పాటు పత్రికల మాస్టర్ హెడ్స్ మీద జాతీయ పతాక చిహ్నాన్ని ముద్రించాలని, టివి ఛానల్స్‌లో 15 రోజుల పాటు జాతీయ పతాక చిహ్నాన్ని నిత్యం కనిపించేలా ప్రసారం చేయాలని ఆయా మీడియా యాజమాన్యాలకు సిఎం కెసిఆర్ విజ్జప్తి చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ సప్తాహం’ సందర్భంగా దేశ భక్తిని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయాలని సిఎం కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News