Saturday, November 23, 2024

తెలంగాణ వచ్చిన తర్వాత ఆదివాసీల ప్రగతి పెరిగింది: సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆదివాసీల ప్రగతి తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో పెరిగిందని, వారికి తెలంగాణ వచ్చాకే మేలు జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి సత్యవతి మాట్లాడుతూ ఆదివాసీ, గిరిజనులందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలను ఆమె తెలిపారు. రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీని బ్లాక్ మెయిల్ చేయడం రేవంత్‌కు అలవాటన్నారు. రేవంత్ రెడ్డియే కాంగ్రెస్‌కు ఘోరీ కట్టడం ఖాయమన్నారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ వాదిని అని పదే పదే చెప్పుకుంటున్నారన్నారు. రేవంత్ తెలంగాణ కోసం చేసిన ఓ గొప్ప పని ఏమిటో చెప్పగలరా అని ఆమె ప్రశ్నించారు. రేవంత్ చేతిలో 2018 కన్నా ఘోరమైన పరిస్థితి 2023లో కాంగ్రెస్‌కు రాబోతోందన్నారు. రేవంత్ బతుకేందో అందరికీ తెలుసన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ అని ఆమె దుయ్యబట్టారు. నిక్కర్ లిక్కర్ పార్టీ ఒక్కటి అయ్యాయని, అంటున్నావ్, నీది చీటర్స్ పార్టీయా, గద్దర్ గౌరవాన్ని రేవంత్ తగ్గిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

గద్దర్‌కు అసెంబ్లీ, మండలిలో సంతాపం తెలిపాం
గద్దర్‌కు శాసనసభలో సభ్యుడు కాకున్నా సంతాపం తెలిపామని, కౌన్సిల్ లో కూడా తెలిపామన్నారు. మంత్రి కెటిఆర్ గద్దర్ అంత్యక్రియలకు సంబంధించి అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని మంత్రి సత్యవతి తెలిపారు. అధికారికంగా అంత్యక్రియలు చేయాలని కెసిఆర్ ఆదేశించారని, గద్దర్ కాంగ్రెస్ పార్టీయా, ఆయన అందరి మనిషి అని ఆమె పేర్కొన్నారు. గద్దర్ కాంగ్రెస్ పార్టీ అయితే కెఎ పార్టీలోకి ఎందుకు వెళ్లారని ఆమె ప్రశ్నించారు. గద్దర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే కొత్త పార్టీ కోసం ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్ట్రర్ చేసుకున్నారని ఆమె తెలిపారు.

గద్దర్ మరణాన్ని ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తానంటే కుదరదన్నారు. రేవంత్ ఇకనైనా భాష మార్చుకోవాలన్నారు. కాంగ్రెస్‌కు పది నియోజక వర్గాల్లో అభ్యర్థులను దించలేని పరిస్థితి రేవంత్ ది అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోరీ కట్టడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఆదివాసీలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఆదివాసీలను అన్నింటా వెనకబడేసింది కాంగ్రెస్ పార్టీ అని మంత్రి సత్యవతి ఆరోపించారు. గిరిజన, ఆదివాసీలు వెనుకబడటం లో ప్రధాన దోషి కాంగ్రెస్ పార్టీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News