Saturday, November 23, 2024

వారంలోగా అభివృద్ధి పనుల్లో పురోగతి కనబరచాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: అభివృద్ధి దిశగా చేపడుతున్న పనుల్లో పురోగతిని కనబర్చాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్షించిన మంత్రి కరీంనగర్ జిల్లాలో డీఎంఎఫ్‌టీ, ఎస్‌డీఎఫ్, పీఆర్ ద్వారా తలపెట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతిని కనబరచాలని, టెండర్ ప్రక్రియను చేపట్టి, అగ్రిమెంట్ పూర్తి చేయాలని, బావుపేట గ్రామంలో రోడ్డుపై నీరు నిలవకుండా యుద్దప్రాతిపదికన నీరు నిలువకుండా తక్షణ చర్యలను చేపట్టాలని తెలిపారు.

అనంతరం తీగలగుట్టపల్లి నుండి చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనుల కొరకు గురువారం భూమి పూజను నిర్వహించనున్నట్లు తెలిపారు. అపోలో ఆసుపత్రి వద్ద రైల్వేలైన్ వద్ద ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్‌రావు, జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఆర్‌అండ్‌బి ఈఈ, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News