Sunday, December 22, 2024

ప్రగతిని ప్రజల్లోకి తీసుకెల్లాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతి, అభివృద్ధి సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెల్లాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రజాప్రతినిధులకు పిలుపు నిచ్చారు. సోమవారం కరీంనగర్ నగర పాలక సంస్థలో మేయర్ సునీల్ రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాల విజయవంతంపై నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని… అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు చాటి చెప్పేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూన్ 2 నుండి 22 వతేదీ వరకు 20 రోజుల పాటు నగరవ్యాప్తంగా చేపట్టబోయే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు పాల్గొనేలా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రజలను బాగస్వాములను చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను 20 రోజుల పాటు వైభవంగా జరపాలన్నారు. రోజు వారి కార్యక్రమాలను నగర వ్యాప్తంగా నిర్వహించి… ప్రభుత్వ ప్రగతి, సంక్షేమాన్ని ప్రజలకుె చాటి చెప్పాలన్నారు. బావి తరాలు గుర్తుంచుకునేలా ఆవిర్భావ దశాబ్ధి వేడుకలు జరపాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 9 సంవత్సరాల్లో కరీంనగర్ నగర రూపు రేఖలు మారాయన్నారు. నగర వ్యాప్తంగా ప్రజలకు బావి తరాల కోసం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలాప్ చేశాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం తో మొదటి సారిగా నగర అభివృద్ధి కోసం సీఎం అస్యురెన్స్ పేరుతో 350 కోట్ల ప్రత్యేక నిధులు తెచ్చి అందమైన నగరంగా తీర్చిదిద్దామన్నారు. అందంగా విస్తరించిన రోడ్లు, చక్కటి డ్రైనేజీలు, పాదాచారులకు ఫుట్ పాత్ లు, అహ్లాదం కోసం పార్కులు, ప్రజలకు ప్రతి రోజు మంచి నీరు తో పాటు ఇలాంటి ఎన్నో సౌకర్యాలు సమకూర్చడం జరిగిందన్నారు.

గత ఆంద్రా పాలకుల చేతిలో హైదరాబాద్ నగరంలో నిధులు విజయవాడ విశాఖపట్నం కు మల్లించే పరిస్తితి ఉండే… మన ప్రత్యక రాష్ట్రం లో హైదరాబాద్ నిధులు కరీంనగర్ తో పాటు అన్ని జిల్లాల అభివృద్ధి కి అందుతున్నాయి అన్నారు. రాష్ట్రం లో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ నగరం గొప్ప రెండో నగరంగా మారబోతుందన్నారు. ప్రభుత్వం నుండి కరీంనగర్ నగర అభివృద్ధి కోసం 132 కోట్ల నిధులు తేవడం జరిగిందని వాటికి అడిషనల్ సాంక్షన్ కూడ ఇవ్వడం జరిగిందన్నారు. టెండర్లు పిలిచి జూన్ చివరి లో 132 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు అన్ని డివిజన్లలో చేపట్టాలని పిలుపు నిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వ పాలనలో అతి తక్కువ కాలంలోనే నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచామన్నారు. గతంలోనే బావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తానని మాట ఇచ్చి అదే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో బావి తరానికి గొప్ప నగరాన్ని అందించాలనే దృడ నిచ్చయంతో పనిచేస్తానని అన్నారు. రాష్ట్రం వచ్చాక ప్రజలకు కేసీఆర్ పాలనలో న్యాయం జరిగిందని… ఇదే పరిపాలన ముందు ముందు కొనసాగితే రాష్ట్రం తో పాటు మన కరీంనగర్ నగరం ఇంకా అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలిపారు. ప్రతి పాలకవర్గ సభ్యుడికి మల్లి ప్రజల మద్దతు తప్పని సరిగా ఉంటుందన్నారు.

కరీంనగర్ మేయర్ యాదగిరి మేయర్ యాదగిరి సునీల్ రావు రావు మాట్లాడుతూ నూతన పాలకవర్గాని వెన్ను దన్నుగా నిలిచి వందల కోట్ల రూపాయలు తెచ్చి నగరాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారికి పాలవర్గం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఐక్యమత్యంతో పనిచేస్తూ…. నగరాన్ని అభివృద్ధి చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ నాయకత్వం ఇంకా కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మా పాలకవర్గం అంతా మీ నాయకత్వం ప్రజలకు సేవలందించడం అదృష్ఠంగా బావిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మీ నాయకత్వమే కొనసాగాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ హరి శకర్, కమీషనర్ సేవా ఇస్లావత్, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News