Wednesday, January 22, 2025

టిఎస్ ఐ పాస్‌తో ప్రగతి పరుగులు

- Advertisement -
- Advertisement -
ఇందుకోసం 80 దేశాల్లోని విధానాలను పరిశీలించాం
ఇది గొప్ప సింగిల్‌విండోగా ఎదగబోతుందని ఆనాడే చెప్పా
ఇప్పుడు రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నది
15 రోజుల్లోగా కొత్త పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం దీని లక్షం
జాప్యం చేసే అధికారిపై రోజుకు రూ.వెయ్యి ఫైన్ వరంగల్
ముద్దుబిడ్డలు మేధా రైల్వే కోచ్‌తో సంచలనం సృష్టిస్తున్నారు
రైల్వే కోచ్‌లనే కాదు..మొత్తం రైలు ఇక్కడే తయారు కావాలి
తెలంగాణ బిడ్డలే ఈరోజు దేశానికి, ప్రపంచానికి అవసరమైన
రైళ్లు తయారు చేసే అద్భుతమైన ప్రాజెక్టు మేధా రైల్వే కోచ్
ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో కెసిఆర్
రియల్ సింగిల్ విండో విధానంతో
లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు
ఆకర్షిస్తున్నాం మేథా రైల్వేకోచ్
ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో
సిఎం కెసిఆర్ తెలంగాణ బిడ్డలే
ఈ రోజు దేశానికి, ప్రపంచానికి
అవసరమైన రైళ్లు తయారుచేసే
అద్భుతమైన ప్రాజెక్టు ఇది

మనతెలంగాణ/హైదరాబాద్/శంకర్‌పల్లి : ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా టిఎస్ ఐపాస్‌ను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రం గారెడ్డి జిల్లా కొండకల్లో మేథా రైల్వేకోచ్ ఫ్యాక్టరీని గురువారం సిఎ సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఎం మాట్లాడారు. తెలంగాణ బిడ్డలే ఈ రోజు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారుచేసే అద్భుతమైన ప్రాజెక్టును, రూ.2500కోట్ల పె ట్టుబడితో ఫేజ్ -1ను పూర్తి చేసి, మ్యానుఫ్యాక్చరిం గ్ పూర్తి చేసి తనతో ప్రారంభింపజేసుకున్నారని అ న్నారు. ఈ ఫ్యాక్టరీ ఇంకా ముందుకెళ్లాలని ఆ కాంక్షించారు. హైదరాబాద్‌లో ఫార్మా, ఫౌల్ట్రీ ఇం డస్ట్రీ బాగా పెరిగింది, జీనోమ్‌వ్యాలీలో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి దాదాపు మూడింట ఒకటో వంతు ప్ర పంచానికి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఎక్క డ అభ్యుదయ పథంలో, ప్రగతి పథంలో గుభాళించాలన్న.. బ్రహ్మాండంగా రావాలన్న దానికి సంబంధించి ఎకో బిల్ కావాలని చెప్పారు. ఈ ఎకోలో భాగంగానే కఠినమైన నిర్ణయం తీసుకొని ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా టిఎస్ ఐపాస్‌ను తీసుకువచ్చామని తెలిపారు. టిఎస్ ఐపాస్ తీసుకువచ్చినప్పుడు తాను శ్రమపడ్డానని అన్నారు. ప్ర పంచంలో భారతదేశంతో పాటు చాలా చోట్ల సిం గిల్ విండోలు ఉన్నాయని తెలంగాణ ఏర్పడ్డ కొత్త లో బిజినెస్ మీటింగ్‌లో పాల్గొన్న సందర్భం లో చాలా గర్వంగా చెప్పేవాడినని పేర్కొన్నారు. రి య ల్ సింగిల్ విండో విధానంతో లక్షల కోట్ల రూ పాయలపెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు. ఫార్స్, బోగస్ ఎంఒయులు కాకుండా రియల్ స్పిరిట్‌లో చేస్తున్నామని చెప్పారు. ఎంత కఠిన చట్టం తీసుకువచ్చామంటే.. 15 రోజుల్లో అనుమ తి ఇచ్చి క్లారిటీ ఇవ్వకపోతే ప్రాజెక్ట్ సాంక్షన్డ్ అని చెప్పినమని పేర్కొన్నారు. ఏ ఆఫీసర్ వద్ద ఫైల్ ఆగినా రోజుకు రూ.1000 జరిమానా విధించేలా నిబంధనలురూపొందించామనితెలిపారు. ఇలాం టి చర్యలతో పారిశ్రామిక ప్రగతి, ఇన్ఫర్మేషన్ టె క్నాలజీ పెరుగుతున్నదని వ్యాఖ్యానించారు.
పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం
వరంగల్ ముద్దుబిడ్డలు కశ్యప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి భారీ ప్రాజెక్టును తీసుకువచ్చి వందల మందికి ఉ పాధి కల్పిస్తుండటం పట్ల సిఎం సంతోషం వ్యక్తం చేశారు. రైల్వే మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే ఊహించలేదని, విడివిడి భాగాలను ఎంత స్కిల్తో చేస్తున్నారో కశ్యప్‌రెడ్డి స్వయంగా చూపించారని అన్నా రు. కశ్యప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మేథా కుటుంబ స భ్యులందరికీ ఈ సందర్భంగా సిఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇంత గొప్ప ప్రాజె క్టు చేపట్టడమే కాదు.. పూర్తి రైలును తయారు చే సేందుకు ముంబయి నుంచి మోనో రైలు తయారీ కి ఆర్డర్ రావడం గొప్ప విషయమని పేర్కొన్నా రు. భవిష్యత్‌లో పూర్తిస్థాయిలో రైలు తయారై పో యే లా ప్రణాళికలు రచిస్తున్నామని చెబుతున్నారని, దేశంతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి స్థాయి కి ఎదుగుతున్నామని చెప్పడం అభినందనీయమన్నారు. 24 గంటలు ఏ సమస్య వచ్చినా పరిష్కారించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News