మహిళా ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ఆర్‌టిసి ఎండి నిర్ణయం
హైదరాబాద్ : అసభ్యకర పోస్టర్లు, ప్రకటనలు ఇక నుంచి ఆర్‌టిసి బస్సులపై అంటించరాదని ఆర్‌టిసి ఎండి సజ్జనార్ నిర్ణయించారు. ప్రయాణికుల ఆదరణ పొందడమే ధ్యేయంగా సజ్జనార్ పనిచేస్తున్నా రు. అందులో భాగంగా ఆర్‌టిసి ప్రకటనల్లో అశ్లీలత లే ని వాటినే ప్రచురించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆర్‌టిసికి ప్రకటనల ద్వారానే ఆదాయం వస్తున్న నేపథ్యంలో మహిళా ప్రయాణికుల నుంచి వస్తు న్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎం డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆశ్లీలంగా ఉన్న పోస్టర్లను, ప్రకటనలు తొలగించి బస్సులకు కొత్త రంగు లేసి ప్రయాణికులను ఆకర్షించే విధంగా రెడీ చేస్తున్నా రు. బస్సులో మహిళలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మహిళలను వేధింపులకు గురిచేస్తే వెంటనే షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసే విధంగా ప్రత్యేకయాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఎండి తెలిపారు.