ముంబయి: కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముంబయి పోలీసులు నగరంలో బుధవారం సిఆర్‌పిసిలోని 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఐదుగురు లేదా అంతకుమించి ఒకేచోట గుమికూడకుండా ఈ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి అమలులోకి వచ్చే ఈ ఉత్తర్వులు మే 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు అమలులో ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 15 రోజులు జన సంచారంపై విధించిన కర్ఫ్యూ తరహా ఆంక్షలలో భాగంగా ఈ నిషేధాజ్ఞలను మహారాష్ట్ర ప్రభుత్వం విధించింది.144 సెక్షన్ రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉంటుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మంగళవారం ప్రకటించారు. ముంబయి పోలీసులు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అన్ని సంస్థలు, బహిరంగ ప్రదేశాలు, కార్యకలాపాలు, సర్వీసులు మూతపడతాయి. సరైన కారణం లేకుండా ప్రజలు బహిరంగ ప్రదేశాలను సందర్శించడానికి వీల్లేదు.
Prohibitions orders under Section 144 issued in Mumbai