మల్లేశం, 8 ఏ.ఎం, మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘23’తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా ప్రమోషన్‌లను ప్రారంభించిన మేకర్స్ టీజర్‌ని లాంచ్ చేశారు.1991 సుండూరు ఊచకోత, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీహిల్స్ కార్ బాంబు పేలుడు.. ఈ మూడు సామూహిక హత్యల నేపధ్యంలో 23 టీజర్ ఆద్యంతం అద్భుతంగా కొనసాగింది. రాజ్ ఆర్ నైపుణ్యం, అతని రచన, దర్శకత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఈవెంట్ లో దర్శకుడు రాజ్ రాచకొండ మాట్లాడుతూ “23 సినిమాకి మంచి నటులు దొరికారు. ఈ సినిమా హ్యూమన్ రైట్స్ వైపు వుంటుంది. న్యాయం దొరకని వారి తరపున వుంటుంది. తప్పుని తప్పని తెలుసుకోవడం ఈ సినిమా ఉద్దేశం. హింసకి వ్యతిరేకంగా తీసిన సినిమా ఇది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీ, తాగుబోతు రమేష్, బీనా, తేజ పాల్గొన్నారు.
హింసకి వ్యతిరేకంగా తీసిన సినిమా
- Advertisement -
- Advertisement -
- Advertisement -