Monday, April 7, 2025

‘మహాకాళి’ చిత్రంలో బాలీవుడ్ స్టార్

- Advertisement -
- Advertisement -

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పివిసియు)ను ప్రేక్షకులకు పరిచయం చేసిన ‘హను-మాన్’ పాన్-ఇండియా విజయం తర్వాత, ఈ ఫ్రాంచైజీలోని నెక్స్ ప్రాజెక్టుల కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందు ప్రకటించిన మూడవ ప్రాజెక్ట్ మహాకాళి పివిసియులో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఆర్‌కెడి స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నెక్స్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే… ఇటీవల ‘చావా’లో తన పవర్ ఫుల్ నటనతో చెరగని ముద్ర వేసిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా మహాకాళి తారాగణంలో చేరబోతున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ‘మహాకాళి’ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. పౌరాణిక ఇతివృత్తాలను వినూత్నమైన సూపర్ హీరో కథలతో మిళితం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News