Monday, November 25, 2024

ఆ ప్రాజెక్టులు పాతవే

- Advertisement -
- Advertisement -

Projects built in Godavari river basin are old

గోదావరి బేసిన్‌లో 967టిఎంసిలకు ఉమ్మడి ఎపిలోనే రూపకల్పన
758టిఎంసిల వినియోగానికి సిడబ్యుసి ఆమోదించింది
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
వివరాలిస్తే పరిశీలిస్తాం : కేంద్రం

మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదీపరివాహక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులు పాతవే అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ట్రిబ్యునల్ గోదావరి నదీజలాల్లో 75శాతం నీటి లభ్యత కింద అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 1486.15టిఎంసిల్లో తెలంగాణ ప్రాంతంలోనే 967.94టిఎంసిల నీటిని ఉపయోగించుకునేందుకు అవసరమైన ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని కేంద్రానికి వివరించింది.గోదావరి బేసిన్ పరిధిలో ఆమోదం లేనివిగా పేర్కొన్న 11 ప్రాజెక్టులు అంధప్రదేశ్ రాష్ట్ర పునర్ విభజన చట్టం మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే ప్రారంభమైన ప్రాజెక్టులని, ఈ ప్రాజెక్టుల ద్వారా ఉపయోగించుకునే గోదావరి జలాల్లో 758.76టింఎంసిలకు సంబంధించిన వాటికి కేంద్ర జలసంఘం ఆమోదం కూడా తెలిపిందని వివరించింది. మరో 148.82టిఎంసిల నీటి వినియోగానికి సంబంధించినప్రాజెక్టులకు సిడబ్యుసిలోని హైడ్రాలజి విభాగం అంగీకారం ఊడా తెలిపిందని, ఇందులో భవిష్యత్ అవసరాల కోసం నిర్మించే ప్రాజెక్టులకు 60.346టిఎంసిల నీటిని రిజర్వ్‌లో పెట్టుకున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో వివరించింది.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఉపయోగించుకునే అదనపు టిఎంసి నీటికి చెందిన పనులు కొత్తవేమి కాదని తెలిపింది.కేంద్ర జలసంఘం ఈ పథకానికి కేటాయించిన 240టిఎంసిల నీటిని వినియోగించుకోవడానికి చెపట్టినపనులే అని, అదికూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నే ఈ పనులు చేపట్టినట్టు కేంద్రానికి తెలిపింది. ఈ పనులకు కేంద్రం ఆమోదం అవసరం లేదని , అందువల్ల ఈ పనులను ఆమోదంలేని పథకాల జాబితానుంచి మినహాయించాలని కోరింది.సిడబ్యుసి ఆమోదం పొందిన కండెం ప్రాజెక్టులో గూడెం ఎత్తిపోతల పథకం భాగమే అని , కందకుర్తి ఎత్తిపోతల కూడా చాల చిన్న పథకమని ఈ రెండు పథకాలకు కూడా కొత్తగా కేంద్రం ఆమోదం అవసరం లేదని తెలిపింది. రామప్ప సరస్సుపాకాల సరస్సు లింక్ దేవాదుల పథకంలో భాగమని తెలిపింది. తుపాకులగూడెం బ్యారేజి కూడా దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగమైనందున దీనికి కొత్తగా ఆమోదం పొందాల్సిన అవసరం లేదని కేంద్రానికి వివరించింది. తుపాకులగూడెం ప్రాజెక్టు ద్వారా కంతనపల్లి ప్రాజెక్టుకు 50టిఎంసిల నీటిని సూత్రప్రాయంగా కేటాయించినప్పటికీ ఆది ఉనికిలో లేదని కేంద్రానికి లేఖలో వివరించింది.

వివరాలు అందజేస్తే ఆ పథకాలను సరి చేస్తాం :కేంద్రం

రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై కేంద్రం స్పందిస్తూ పథకాలకు సంబంధించిన వివరాలు అందజేస్తే పరిశీలన చేసి వాటిని జాబితాలో సరిచేస్తామని తెలిపింది. గోదావరి నదీపరివాహకంగా చేపట్టిన 11ప్రాజెక్టుల్లో తమకు రాష్ట్రం నుంచి 5ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్‌లు అందగా వీటిని పరిశీలిస్తున్నట్టు తెలిపింది. మిగిలిన ఆరు పథకాల వివరాలు అందజేస్తే పరిశీలించి సరిచేస్తామని తెలిపింది. కేంద్ర జలసంఘం ఆమొదం తెలిపిన వాటికి సంబంధించి ఆధారాలు కూడా పంపాలని కోరింది. కాళేశ్వంర ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న అదనపు టిఎంసి పనికి సంబంధించిన వివరాలను గోదావరి నదీయాజమాన్య బోర్డుకు అందజేయాలని రాష్ట్రానికి సూచిందింది. తుపాలకుల గూడెం ప్రాజెక్టుకు సమక్క సాగర్ పేరుతో కేద్రానికి డిపిఆర్ సమర్పించారని ఇది పరిశీలినలో ఉందని కేంద్రం తెలిపింది. రామప్పపాకాల లింక్ కూడా తుపాకుల గూడెం బ్యారేజి డిపిఆర్‌లో ఉందని వీటిని కేంద్ర జలసంఘం,గోదావరి బోర్డు పరిశీలించాల్సివుందని తెలిపింది. బేసిన్ పరిధిలోని ఈ ప్రాజెక్టుల వివరాలను అందజేస్తే సిడబ్యుసితోపాటు గోదావరి బోర్డు పరిశీలన చేస్తుందని కేంద్ర జలమంత్రిత్వశాఖ రాష్ట్రానికి తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News