Saturday, December 21, 2024

బిఆర్‌ఎస్ పాలనలో కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉచిత్ విద్యుత్ అందించిందే కాంగ్రెస్ అని, దాని పేటెంట్ హక్కూ మా పార్టీదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బిఆర్‌ఎస్ హయాంలో ఎక్కువలో ఎక్కువ 14 గంటలే కరెంట్ వచ్చేదన్నారు. ఒక సబ్‌స్టేషన్‌లో లాగ్ బుక్ పరిశీలిస్తే తెలిసిందన్నారు. శాసన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆ గంటల్లోనూ ఐదారుసార్లు కోతలుండేవని విద్యుత్ సిబ్బంది చెప్పేవారని, బిఆర్‌ఎస్ 24 గంటలు విద్యుత్ సరఫరా చేయలేదని, ఆధారాలు పంపిస్తామని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో కొత్తగా ఒక ఎకరా సాగులోకి వచ్చినట్లైతే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బిఆర్‌ఎస్ పాలనలో నీళ్లు ఇవ్వలేదని, విద్యుత్ ఇవ్వలేదని, ఏమీ లేదని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ పాలనలో కూలిపోయే ప్రాజెక్టులు కట్టారని విమర్శలు గుప్పించారు. మిషన్ భగీరథ ద్వారా నల్లా నీళ్లు వచ్చాయని ప్రజలు చెబితే మరోసారి ఓట్లు అడగమని, మిషన్ భగీరథ రూ.50 వేల కోట్లు తినేశారని వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News