Sunday, December 22, 2024

కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగించేందకు తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించాయి. గురువారం జలసౌధలో కృష్ణాబోర్డు సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ శివ్‌నందన్ కుమార్ అ ధ్యక్షతన జరిగిన ఈ సమవేశంలో తెలంగాణ రా ష్ట్రం నుంచి నీటిసారుదల శాఖ ఈఎన్సీ మురళీ ధ ర్ , ఎపి నుంచి ఇఎన్‌సి నారాయణరెడ్డి పాల్గొ న్నా రు. ఉదయం 11గంటల నుంచి సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశం ఉత్కంఠ భరితంగా సాగింది. బోర్డుకు ప్రాజెక్టుల అప్పగిం త, కృష్ణానదీ జలాల పంపిణీ, నిర్వహణ, ప్రాజెక్టుల పర్యవేక్షణ, బోర్డుకు నిధులు సమకూర్చడం, రెండు రాష్ట్రాల నుంచి సిబ్బంది కేటాయింపులు తదితర కీలక అంశాలపై సదీర్గంగా చర్చించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టును బోర్డు కు అప్పగించేందుకు ఇఎన్‌సి మురళీధర్ అం గీకారం తెలపగా, ఎపి పర్యవేక్షణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టును కూడా బోర్డుకు అప్పగించేందుకు ఆ రాష్ట్ర ఇఎన్‌సి నారాయణరెడ్డి సుముఖత తెలిపారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల అప్పగింతపై రెం డేళ్లకుపైగా కొనసాగుతూ వస్తు న్న చిక్కుముడులు వీడిపోయాయి. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న తొమ్మది ఔట్‌లెట్లను బోర్డుకు అప్పగించేందకు అంగీకరించగా, ఎపి కూడా తన పరిధిలో ఉన్న ఆ రు ఔట్‌లెట్లను అప్పగిస్తున్నట్టు వెల్లడించింది. దీం తో ఇప్పటిదాక కొనసాగుతూ వచ్చిన ఉత్కంఠకు తెరపడింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేదాకా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు తెలుగు రాష్ట్రాలకు కృష్ణానదీ జలాలను పంపిణీ చేయటం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తాగునీటికి, సాగు నీటికి అవసరాల మేరకు నీటిని విడుదల చేయటం, వినియోగించుకుంటున్న నీటిని లెక్కించటం, వర్షాకాలం వరదల సందర్భంగా కృ ష్ణానదీ నుంచి వృధాగా సముద్రంలోకి వెళ్లే వరద జలాలను రెండు రాష్ట్రాలకు తగిన నిష్పత్తిలో కేటాయింపులు చేసి వినియోగించుకునేలా చూడటం తదితర అంశాలన్నింటినీ పర్యవేక్షిస్తు, అవసరాలకు తగ్గట్టుగా చర్చించి నిర్ణయాలు తీసుకునే బాధ్యతను త్రిసభ్యకమిటీకి అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. త్రిసభ్య కమిటీ బోర్డు సభ్య కార్యదర్శి కన్వీనర్‌గా, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రక్షణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సిఆర్‌పిఎఫ్ బలగాలకు అప్పగించేందుకు నిర్ణయించారు. కేంద్ర బలగాలు ఇక నుంచి బోర్డు కనుసన్న ల్లో విధులు నిర్వహించనున్నాయి. బోర్డు నిర్వహణకోసం అవసరమైన నిధులు అందజేసేందుకు రెండు రా్రష్ట్రాలు అంగీకరించాయి. అంతే కాకుండా బోర్డు పరిధిలోనికి చేరనున్న ప్రాజెక్టుల నిర్వహణను పర్యవేక్షించేందుకు అవసరమైన సిబ్బందిని తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సమకూర్చేందుక కూడా రెం డు ఆమోదం లభించింది. శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల్లో ఉన్న నీటిని వేసవి అవసరాల కోసం వినియోగించుకునేందుకు కూడా సమావేశంలో చ ర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఉన్న నీటిలో నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాలువకు రెండు టీఎంసీలు, కుడి కాలువకు మూడు టీఎంసీలు అవసరాలకు తగ్గట్టుగా విడుదల చేసేందకు సమావేశంలో అంగీకారం కుదిరింది.
పవర్ స్టేషన్స్‌పై నిర్ణయం జరగలేదు : తెలంగాణ ఇఎన్‌సి మురళీధర్
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ మీడియాతో మాట్లాడుతూ కృష్ణా ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కృష్ణాబోర్డకు ఇవ్వడం జరిగిందన్నా రు. పవర్ స్టేషన్స్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నాగార్జున సాగర్‌ను తెలంగాణ, శ్రీశైలంను ఏపి చూసుకుంటుందన్నారు. ప్రాజెక్టుల న్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయని వెల్లడించారు. కృష్ణానదీ జలాలకు సంబంధించి తమ రాష్ట్ర డిమాండ్స్ అన్ని కేంద్రానికి లేఖలు రాసామని, ఇం కా అక్కడ నుంచి నిర్ణయం రాలేదని తెలిపారు. నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రాజెక్టుల వద్ద భద్రత అనేది పరిస్థితినిబట్టి బోర్డు కనుసన్నల్లోజరుగుతుందని తెలిపారు. కృష్టాబోర్డు పరిధిలో ఉన్న 15 ఔట్‌లెట్లు బోర్డు పరిధిలోకి వెళ్తాయని తెలిపారు.
ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదని, ఆపరేషనల్, నీటి విడుదల బోర్డు చూసుకుంటుందన్నారు.సిఆర్‌పిఎఫ్ బలగాలు సైతం కృష్ణా బోర్డు పరిధిలోనే ఉం టాయన్నారు. నిర్వహణ కోసం స్టాప్ కేటాయింపు 40: 45 కావాలని అడుగుతున్నారని ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు.
త్రిసభ్యకమిటీదే తుది నిర్ణయం: ఏపి ఈఎన్‌సి
కృష్ణాబోర్డు సమావేశం అనంతరం ఏపి నీటిపారుద ల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బోర్డు పరిధిలో మొత్తం 15 ఓటిస్‌లలో 9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్‌వి ఉన్నాయని తెలిపారు. కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమకు ఎ లాంటి అభ్యంతరం లేదన్నారు ఆపరేషనల్ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాప్ కేటాయింపు ఉంటుందని తెలిపారు.నీటి కేటాయింపులపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం అని వెల్లడించారు. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ త్రిసభ్య కమిటీ అప్పుడున్న పరిస్థితు ల్లో తీసుకుంటారని తెలిపారు.
సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి 2 టీఎంసీలు, రైట్‌కెనాల్ నుంచి 3 టీఎంసీ లు ఏపికి విడుదలకు ఒప్పుకున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌లో 5 టీఎంసీలకు ఏపికి ముందుగానే కేటాయింపు ఉందన్నారు. ప్రాజెక్టుల ఆపరేషనల్ కోసం తెలంగాణ ఒప్పుకుందని నారాయణరెడ్డి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News