Monday, December 23, 2024

కృష్ణా జలాలు సముద్రం పాలు

- Advertisement -
- Advertisement -

సాగర్ నుంచి 40 టిఎంసిల
విడుదల ప్రకాశం బ్యారేజీ
వద్ద ప్రమాద హెచ్చరిక
లోతట్టు ప్రాంతాల ప్రజలను
ఖాళీ చేయించిన అధికారులు
ఇప్పటికే సాగరంలోకి
78 టిఎంసిల జలాలు

గాలేరు-నగరి, హంద్రీ-నీవా స్రవంతికి
అనుమతుల్లేవు శ్రీశైలం ప్రాజెక్టు రూల్‌కర్వ్ సమాచారం
ఇవ్వాలి కృష్ణా రివర్ బోర్డ్ చైర్మన్‌కుతెలంగాణ మరో లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదిలో వరద పోటెత్తింది. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజి దాక కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నీ గరిష్ట స్థాయి నీటిమట్టాలకు చేరాయి. జలాశయాలు పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధంతో నిండు కుండలను తలపిస్తున్నాయి. దీంతో ఎగువనుంచి వస్తున్న వరద నీటిని వస్తున్నది వస్తున్నట్టుగానే గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద అన్నిగేట్లు ఎత్తివేశారు. దీంతో లక్షల క్యూసెక్కుల కృష్ణాజలాలు సము ద్రం వైపు పరుగులు పెడుతున్నాయి. ఎగువ నుం చి శ్రీశైలం ప్రాజెక్టుకు ఉదయం 4.47లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా దిగువకు గేట్ల ద్వారా 3.70లక్షల క్యూసెక్కులు, కుడి ఎడమ గట్ల విద్యుత్ కేంద్రాల నుంచి 66,233 క్యూసెక్కులు , ప్రధాన కాలువలకు 16,088క్యూస్కెక్కులు విడుదల చేస్తూ రిజర్వాయర్‌లో 2.87టిఎంసీల కుషన్ ఉంచూతూ వచ్చారు. అయితే సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మరింతగా పెరిగింది. ఎగువ నుంచి 4,55,614 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, జలాశయం నుంచి 4,50,259 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తూ వరద నియంత్రణ చర్యలు చేపట్టారు. ఎగువ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వదర ప్రవాహం భారీగా పెరిగింది.

ఉదయం 6గంటలకు 3.11లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా ప్రాజెక్టు గేట్ల ద్వారా 2,77,136క్యూసెక్కులు, పవర్‌హౌస్ ద్వారా 32,541క్యూసెక్కులు, కాలువల ద్వారా 11295 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ వచ్చారు. సాయంత్రం 6గంటలకు సాగర్‌లోకి వదర ప్రవా హం లక్షక్యూసెక్కులు అదనంగా పెరిగింది.. ఎగు వ నుంచి 4,11932క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, రిజర్వాయర్ నుంచి అంతే నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో వరద నియంత్రణ చర్యల కింద 7టిఎంసీల ఖాళీని నిర్వహిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్నభారీ వరదను దృష్టిలో ఉంచుకుని పులిచింతల జలాశయాన్ని ఖాళీ చేస్తున్నారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 45.77టిఎంసీలు కాగా , 32టిఎంసీలు నిలువ ఉంచారు. ఎగువ నుంచి 294530క్యూసెక్కులుచేరుతుండగా, 3,65,475 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

సముద్రానికి 40టిఎంసీలు!

ఎగువ నుంచి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ప్రకాశం బ్యారేజి మొత్తం 70గేట్లు ఎత్తివేశారు. బ్యారేజి దిగువన మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదీ పరివాహక గ్రామాల వారిని అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నదికి ఇరుపైపులా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. బ్యారేజి మీదుగా కృష్ణజాలాలు సముద్రం వైపు పరుగులు తీస్తున్నాయి. ఎగువ నుంచి 4.10లక్షల క్యూసెక్కుల వరద చేరుతుండగా, వచ్చిన నీటిని వచ్చినట్టుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. రోజుకు 40టిఎంసీల నీరు ప్రకాశం బ్యారేజి మీదుగా సముద్రానికి చేరుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి శుక్రవారం ఉదయం వరకూ ప్రకాశం బ్యారేజి నుంచి78టిఎంసీల నీరు సముద్రానికి చేరుకుంది. సాయంత్రానికి వరద ఉధృతి మరింతగా పెరిగింది. దీంతో 4లక్షలకు పైగా (40టిఎంసీలు) వరద నీటిని సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది మే చివరి వరకూ ప్రకాశం బ్యారేజి ద్వారా 170టిఎంసీల నీటిని సాగు , తాగు నీటి అవసరాలకు ఉపయోగించకోగా, 501టిఎంసీల కృష్ణాజలాలు సముద్రంలో కలిసిపోయాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News