వాషింగ్టన్ : కొన్నేళ్ల పాటు జరగనున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు అండగా ఉండేందుకు పశ్చిమదేశాలు సన్నద్ధంగా ఉండాలని నాటో చీఫ్ జేన్స్ స్టాలెన్‌బర్గ్ హెచ్చరించారు. ఈ యుద్ధంలో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. అదే సమయంలో మాస్కో తన సైనిక లక్షాలు సాధించుకొంటే అంతకు మించిన మూల్యం చెల్లిస్తామన్నారు. సైనిక సాయం కారణంగా యుద్ధం ఖరీదు కాదని, పెరుగుతున్న ఇంధన, ఆహార ధరల కారణంగా యుద్ధంలో చెల్లించాల్సిన మూల్యం పెరిగిపోతోందన్నారు. జర్మనీకి చెందిన ఓ పత్రికతో మాట్లాడుతూ నాటో చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమష్టిగా సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించిన సమయం లోనే స్టాలెన్‌బర్గ్ నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వెలువడటం గమనార్హం. ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడం వల్ల తూర్పు డాన్‌బాస్ లోని ఆక్రమిత ప్రాంతాలను విముక్తి చేయించడానికి ఉపయోగపడుతుందని స్టాలెన్‌బర్గ్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ అధికారులు భారీ ఆయుధాల కోసం పశ్చిమదేశాలను అభ్యర్థిస్తున్నారు.
ఉక్రెయిన్‌లో సుదీర్ఘ యుద్ధం తప్పక పోవచ్చు : నాటో హెచ్చరిక
- Advertisement -
- Advertisement -
- Advertisement -