బిజెపి గూటికి ప్రముఖ నేత రాజేష్ మిశ్రా
ప్రధాని మోడీపై ప్రశంస
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత రాజేష్ మిశ్రా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని శ్లాఘిస్తూ మంగళవారం న్యూఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. వారణాసి లోక్‌సభకు సీటుకు కాంగ్రెస్ మాజీ ఎ ంపి అయిన రాజేష్ మిశ్రా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, రవి శంకర్ ప్రసాద్‌తో సహా పార్టీ సీనియర్ నేతల సమక్షంలో బిజెపిలో చేరారు.
ఢిల్లీలో సంయుక్త విలేకరుల గోష్ఠిలో మిశ్రా ప్రసంగిస్తూ, బిజెపిలో తనను చేర్చుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాలకు ధన్యవాదాలు తెలియజేశారు. తన రాజకీయ జీవితం చివరి వరకు కాషాయ పార్టీతోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఈ సారి వారణాసిలో పోలింగ్ బూత్‌లలో కనీసం పోలింగ్ ఏజెంట్ కూడా ప్రతిపక్షానికి లభించకుండా చూడడమే తన ధ్యేయమని ఆయన చెప్పారు. ‘నేను కాంగ్రెస్‌తో రాజకీయాలు ప్రారంభించాను. నా తక్కిన రాజకీయ జీవితం బిజెపితో నిశ్చయంగా గడుపుతాను’ అని మిశ్రా చెప్పారు.