మనతెలంగాణ/కామారెడ్డి ప్రతినిధి/సంగారెడ్డి: తెలంగాణ ప్రజల స్వప్నాలను సాకారం చేస్తామని అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అ మలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చింది కాంగ్రెస్సేనని ఆ ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామన్నారు. తా ము ఏం చేశామని మోడీ, కెసిఆర్ అంటున్నారని మీరు నడిచే రోడ్డు, మీరు చదివిన విశ్వ విద్యాలయాలు కట్టించిది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ విషయం దేశ ప్రజలకు తెలుసని ఆయన అన్నా రు. మోడీపై తాను పోరాటం చేస్తుంటే తనపై 24 అక్రమ కేసులు పెట్టి ఎంపి సభ్యత్వాన్ని రద్దు చే శారని, 55 గంటల ఇడి విచారణ చేపట్టారని తన ఇళ్లు సైతం లాక్కోవడానికి ప్రయత్నించారని చెప్పారు. తనకు ఇల్లు లేకున్నా దేశంలోని కోట్లా ది ప్రజల హృదయాల్లో తనకు చోటుందని అన్నారు. బిసిని సిఎం చేస్తామని అంటున్న బిజెపి ముందు ఎన్నికల్లో గెలవాలని తరువాత సిఎం అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీల ద్వారా తెలంగాణ ప్రజలు ఎంతో ల బ్ధి పొందుతారని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ ప్ర కటించిన ఆరు గ్యారంటీ పథకాలకు ప్రజల నుం చి మంచి స్పందన వస్తుందని ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమ ని రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. పిసిసి ఛీప్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మొత్తం కా మారెడ్డి వైపు చూస్తుందని కామారెడ్డిలో కాంగ్రెస్‌ను పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, నాయకులు వేణుగోపాల్, షబ్బీర్ అలీ, మహేష్‌కుమార్ గౌడ్, యూసుఫ్ అలీ, కాం గ్రెస్ పార్టీ అభ్యర్థులు మదన్‌మోహన్ రావు, ఏను గు రవీందర్ రెడ్డి, లక్ష్మీకాంతరావు తదితరులు పాల్గొన్నారు.
మొదటి కేబినెట్‌లోనే చట్టాలుగా
సంగారెడ్డిలోని గంజి మైదాన్‌లో ఆదివారం ఎం ఎల్‌ఎ జగ్గారెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ విజయభేరి సభ జరిగింది. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలను మొదటి కేబినెట్‌లోనే చట్టంగా మారుస్తామని తెలిపారు. తొలుత తెలంగాణాలో అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత కేంద్రంలో ఢిల్లీలో బిజెపిని ఓడిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి అభ్యర్థి జగ్గారెడ్డి, టిపిసిసి నాయకుడు జెట్టి కుసుమ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మళ జగ్గారెడ్డి, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ జయారెడ్డి, నాయకులుతో అనంతకిషన్, సంతోష్, జార్జ్ తదితరులున్నారు.