Thursday, January 23, 2025

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

- Advertisement -
- Advertisement -
  • బిజెపి జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి

ములుగు జిల్లా ప్రతినిధి: గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ ములుగు మండల బిజెపి అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ 2014, 2018 ఎన్నికల సందర్భంలో అనంతరం హామీలు ఇచ్చి లబ్దిపొంది అధికారంలోకి రావడం జరిగిందని అన్నారు.

ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వకపోవడంలో ఆంతర్యమేంటని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో లక్షలాదిమంది పోరాటం చేసి తొలి మలి దశ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన విద్యార్ధులకు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక సంవత్సరాల పాటు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ లక్షలాది రూపాయలు కార్పొరేట్ వ్యవస్థ పేద విద్యార్ధుల రక్తం పీల్చుకుంటుందని తెలిపారు.దళితులకు మూడు ఎకరాల భూమి కేటాయిస్తానని చెప్పి నేటి వరకూ మూడు ఎకరాల భూమి కేటాయించకకుండా నిద్రావస్థలో ప్రభుత్వం ఉందని అన్నారు.

ఉచిత కరెంట్ ఇవ్వకుండా విద్యుత్ బిల్లులు పెంచుతూ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలంటే రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకి ఓటువేసి అధికారంలోకి రావడమే లక్షంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, కార్యదర్శి రవింద్రచారి, అధికార ప్రతినిధి వాసుదేవ రెడ్డి, నాయకులు మహేందర్, కృష్ణారావు, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్, హరీష్ రెడ్డి, కోయిల కవిరాజ్, మొగిలి, మహేష్, సాయి సురేష్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News