Monday, December 23, 2024

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా: ఎంఎల్ఎ కూసుకుంట్ల

- Advertisement -
- Advertisement -

మునుగొడు : మునుగొడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ త్వరితగతిన నెరవేరుస్తామని మునుగొడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలం లోని చెల్మెడ కోతులారం,వెల్మకన్నె,కొంపల్లి,చీకటిమామిడి,చెల్లేడు గ్రామాలో ఎస్‌డిఎఫ్ ఉపాది హామీ నిధులతో నిర్మించే సిసి రోడ్లు, డ్రైన్ల పనులకు ఆయన శంకుస్తాపనలు చేసారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతు ఎన్నికల్లో తనను గెలిపించిన మునుగొడు నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్,మంత్రులు కెటిఆర్, జగదీశ్‌రెడ్డిల సహకారం తో నియోజక వర్గంలో అభివృధ్ది పనులను పరుగులు పెట్టిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి కర్నాటి స్వామియాదవ్,ఎంపిడిఓ ఏ జానయ్య,పిఆర్ డిఈ రఘుపతి,ఏఈ రామకృష్ణ,బిఆర్‌ఎస్ మండలపార్టి అధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏరుకొండ శ్రీనివాస్,వైస్ ఎంపిపి అనంత వీణా లింగస్వామిగౌడ్,సర్పంచులు తాటికొండ సంతోష సైదులు,పలుగ్రామాల ప్రజా ప్రతినిధులు ,పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News