Friday, March 21, 2025

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్… రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండపై కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటులు యూట్యూబర్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ యాంకర్ శ్యామల మొత్తం 25 మందిపై కేసు నమోదు చేశామని మియాపూర్ పోలీసులు వెల్లడించారు. మియాపూర్ ప్రగతి ఎన్ క్లేవ్‌లో నివాసం ఉంటున్న ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారిపై 318 (4) బీఎన్‌ఎస్,3,3(ఎ),4 టీఎస్‌జీఎ,66డి ఐటీఏ చట్టం -2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.  నటులు, యూట్యూబర్స్ కు ఫాలోవర్స్ అధికంగా ఉండడంతో పైసలకు ఆశపడి యువతను తప్పుదోవ పట్టించే విధంగా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబర్లు, నటులు ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రిత, అజయ్, సన్నీ, సుధీర్‌లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News