Saturday, November 16, 2024

టిక్కెట్ల కొనుగోలుకు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న ద.మ. రైల్వే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రైల్వే టిక్కెట్ల కొనుగోలు సౌలభ్యం కోసం అన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో పిఓఎస్ మెషీన్లు , యూపిఐ ద్వారా చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే డిజిటల్ కార్యక్రమాల అమలులో ముందంజలో ఉంది. ఈ దిశలో భాగంగా యూటిఎస్ మొబైల్ యాప్, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు, పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్లు ( పిఓఎస్), యూపిఐ చెల్లింపులు మొదలైన వాటిని ప్రవేశపెట్టడం వంటి అనేక చర్యలు చేపట్టారు. ఆన్ లైన్ సదుపాయాలను బలోపేతం చేయడానికి రైలు వినియోగదారులు సులభంగా సౌకర్యవంతంగా టిక్కెట్లు కొనుగోలు చేయడానికి, నగదు రహిత లావాదేవీలు డిజిటల్ చెల్లింపులను మరింతగా ప్రోత్సహించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

దీని ప్రకారం దాదాపు జోన్‌లోని అన్ని ముఖ్యమైన నాన్ -సబర్బన్ స్టేషన్లు (ఎన్‌ఎస్‌జి.) 1-4, సబ్-అర్బన్ కేటగిరీ స్టేషన్లలోని అన్ని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పిఆర్‌ఎస్.), అన్ రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (యూ.టి.ఎస్.) కౌంటర్లలో పిఓఎస్ మెషీన్లు చెల్లింపునకు ఏర్పాటు చేసింది. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున, నగదు రహిత చెల్లింపులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. దీని ప్రకారం రైలు ప్రయాణీకులకు అనుగుణంగా సేవ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే సానుకూల ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో ఈ ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం పి.ఆర్.ఎస్. యూ.టి.ఎస్. టికెటింగ్ కోసం 466 పిఓఎస్ యంత్రాలు అందుబాటులో ఉంచింది.

ఈ పి.ఓ.ఎస్ మెషీన్లు డెబిట్ , క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులను సులభతరం చేస్తాయి. తద్వారా సులభతరమైన సౌకర్యవంతమైన లావాదేవీలను అందజేయనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రైల్వేలో డిజిటల్ ఇండియా చొరవను బలోపేతం చేయడానికి రైలు వినియోగదారులందరికీ సులభమైన వేగవంతమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థను బలోపేతం చేయడానికి సానుకూలంగా ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. టికెట్ కొనుగోలులో నగదు రహిత లావాదేవీలను అనుసరించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఫలితంగా రైలు వినియోగదార్ల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా వారికి సులభమైన , సౌకర్యవంతమైన కొనుగోలు అవకాశాన్ని అందజేస్తుందని తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News