- Advertisement -
హైదరాబాద్: వ్యవసాయంలో యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాల సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడారు. యాంత్రీకరణతో సకాలంలో పనులు పూర్తవుతున్నాయని తెలియజేశారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరుగుతోందన్నారు. వ్యవసాయమనేది సామూహిక కార్యక్రమమని, వ్యవసాయంలో కూలీల కొరత పెరిగిందన్నారు. తెలంగాణలో 48806 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోందన్నారు. 25 జిల్లాల్లో 8.18 ఎకరాల్లో ఆయల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉందని, ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సమావేశాలు, వర్క్‌షాపులు నిర్వహించామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
- Advertisement -