Wednesday, January 22, 2025

టాలెంట్ ఉన్నవారికే ప్రమోషను

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కమిష నరేట్ వార్షిక నేర నివేదికను సిపి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఫారసు లేఖలతో వచ్చేవారికి పోస్టింగ్‌లు ఇస్తారా? అని ఓ విలేక రి అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో స్పందించారు. పోస్టింగ్‌ల కోసం సిఫారసు లేఖలతో వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టాలెంట్ ఉన్నవారికే ప్రమోషన్లు ఇస్తామన్నారు. సిఫారసు లేఖలతో వచ్చేవారికి పోస్టింగ్‌లు ఉండవని స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. లేఖలు పట్టుకుని వస్తే ఎసిఆర్‌లో పేర్లు నమోదు చేస్తాం, ఒకసారి పేరు నమోదు చేస్తే ప్రమోషన్లు ఉండవని స్పష్టం చేశారు.
రెండు శాతం నేరాలు పెరుగుదల
ఇక, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రెండు శాతాలు నేరాలు పెరిగాయని, స్థిరాస్తి నేరాలు కూడా అంతకుమించి నమోదయ్యాయన్నారు. ఈ ఏడాది హత్యలు తగ్గి స్తిరాస్థి సంబంధిత నేరాలు 3 శాతం పెరిగినట్లు వెల్లడిం చారు. ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మహిళలపై నేరాలు 12 శాతం పెరిగాయన్నారు. మహిళలపై 2022లో 343 అత్యాచార కేసులు నమోదు కాగా, ఈ ఏడాది వాటి సంఖ్య 403కు చేరిందన్నారు. అంటే 60కేసులు ఎక్కువ రికార్డయ్యాయి. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు పెరగడంతో వాటిని అంతే వేగంతో పోలీసులు పరిష్కరిస్తున్నారన్నారు. ఈ ఏడాది 9 శాతం దోపిడీలు పెరిగితే, పోక్సో కేసులు 12 శాతం తగ్గాయన్నారు. ఆర్థిక నేరాలు 2022లో 292 కేసులు నమోదైతే, 2023లో ఆ కేసుల సంఖ్య 344కి చేరిందని తెలిపారు. సైబర్ నేరాలు ఊహించని విధంగా 11 శాతం పెరిగాయన్నారు. ‘2022లో సైబర్ నేరాల్లో రూ.82 కోట్లు ప్రజలు మోసపోయారు. 51 కోట్లు అధికంగా సైబర్ నేరగాళ్లు దోచేశారు. అంటే రూ.133 కోట్లు కాజేశారు. దేశంలో మొదటిసారిగా సైబర్ క్రైమ్ వింగ్‌ను ఏర్పాటు చేసిన’ట్లు సిపి వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీపై నిపుణులను పిలిచి అవగాహన కల్పించా రన్నారు. ఈ ఏడాది 79 హత్యలు, 403 రేప్ కేసులు, 242 కిడ్నాప్‌లు, 4,909 చీటింగ్ కేసులు నమోదయ్యాయన్నారు. 2వేల 637 రోడ్డు ప్రమాదాలు, 262 హత్యాయత్నాలు, 91 దొంగతనాలు జరిగా యని పేర్కొన్నారు. నగర ప్రజలు పోగొట్టుకున్న సొత్తులో 75 శాతం పోలీసులు రికవరీ చేశారన్నారు. ఏడాది కాలంలో 63 శాతం నేరస్థులకు శిక్షలు పడితే అందులో 13 మందికి జీవిత ఖైదు పడింది. వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లుగా రికార్డయిందని వెల్లడించారు.
పబ్స్, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్ యజమానులకు హెచ్చరిక
నూతన సంవత్సర వేడుకలను అర్ధరాత్రి ఒంటి గంట లోపు ముగించాలని సిపి సూచించారు. నిబంధనలను అధిగమిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోందని, సరఫరా చేసే వాళ్లు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా ముఠాల కార్యకలాపాలను సహించేది లేదని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. పబ్స్, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్ యజమానులు డ్రగ్స్ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News