Wednesday, January 22, 2025

పదోన్నతి బాధ్యతను పెంచుతుంది

- Advertisement -
- Advertisement -
  • నూతన డిఎస్పీలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్త ంగా సిఐ నుంచి డిఎస్పీ ప్రమోషన్లు కూడా వచ్చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 141 మంది సిఐలకు డిఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిఎస్పీలుగా ప్రమోషన్లు పొందిన వారందరికీ రాష్ట్ర విద్యుత్ శాఖ మం త్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో పదోన్నతి అనేది మరింత బాధ్యత పెంచుతుం దన్నారు. మంత్రిని కలిసిన వారిలో సూర్యాపేట రూరల్ సిఐగా పనిచేస్తూ పదోన్నతి పొందిన సోమనాయారణ సింగ్, చిట్యాల సిఐగా పనిచేస్తూ పదోన్నతి పొందిన శివరామిరెడ్డి, సూర్యాపేట ఎస్బీ సిఐగా పనిచేస్తూ పదోన్నతి పొందిన తుల శ్రీనివాస్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News