Saturday, November 16, 2024

రాష్ట్ర హైకోర్టు సిజెగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు పదోన్నతి

- Advertisement -
- Advertisement -

Promotion of Justice Ujjal Bhuyan as State High Court CJ

జస్టిస్ సతీష్ చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయాన్‌కు పదోన్నతి కల్పిస్తూ సిజెగా పనిచేసిన సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మంగళవారం నాడు నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీకి, ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ విపిన్ సంగి, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అంజాద్ సయీద్, రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎస్.ఎస్. షిండే, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాష్మిన్ ఛాయల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

కాగా ఈ సిఫార్సులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలపాల్సి ఉంది. హైకోర్టు నూతన సిజెగా పదోన్నతి పొందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన గతంలో గౌహతి హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా, 2019లో బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. ముంబైలో రెండు సంవత్సరాలు పనిచేసిన ఆయన 2021 అక్టోబర్ 22 న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఉజ్జల్ భూయాన్ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా కొనసాగుతున్నారు.

సిజె ఉజ్జల్ భూయాన్ నేపథ్యం 

గౌహతిలో 1964 ఆగస్టు 2 జన్మించిన భుయాన్ గౌహతిలోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించారు. అనంతరం గౌహతిలోని కాటన్ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించిన భుయాన్ ఢిల్లీలోని కిరోరి మాల్ కాలేజీ నుండి ఆర్ట్‌లో ఎల్‌ఎల్ బి లో పట్టా పొందాడు. భూయాన్ తండ్రి సుచేంద్ర నాథ్ భుయాన్ సైతం సీనియర్ న్యాయవాది కావడంతో గౌహతిలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి డిగ్రీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ చేసి, గౌహతి హైకోర్టు పరిధిలోని అగర్తల, షిల్లాంగ్, కోహిమా , ఇటానగర్‌లలో పలు బెంచ్‌ల వద్ద పని చేశారు. అలాగే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, గౌహతి బెంచ్,అస్సాం బోర్డ్ ఆఫ్ రెవెన్యూ, లేబర్ కోర్టు, వివిధ సివిల్ కోర్టులు, స్టేట్ కన్స్యూమర్ ఫోరంలోనూ న్యాయవాదిగా సేవలందించారు.

అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్‌లో పని చేసిన భూయాన్ మే, 1995 నుండి జూనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా ప్రారంభించి 16 సంవత్సరాల పాటు ఆదాయపు పన్ను శాఖకు స్టాండింగ్ కౌన్సెల్‌గా ఉన్నారు. కాలక్రమంలో ఆదాయపు పన్ను శాఖ సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ ప్రత్యేక న్యాయవాదిగా విధులు నిర్వర్తించారు. గౌహతి హైకోర్టు స్టాండింగ్ కౌన్సెల్‌తో పాటు గౌహతి హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టుకు 2008 జనవరి 18న అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన జనవరి 15, 2010న పర్మిమెంట్ జడ్జి అయ్యారు. 2011న అస్సాం అదనపు అడ్వకేట్ జనరల్‌గా నియామితులై గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News