Thursday, January 16, 2025

ఉపాధ్యాయ పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే ఉపాధ్యాయులకు బదిలీలతోపాటు పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ ఎంఎల్‌సిలు, సంఘ బాధ్యులతో గురువారం మంత్రి స మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు నూతన జిల్లాల శారీదా సీనియారిటీ ప్రాతిపదికన యాజమాన్యాల వారీగా పదోన్నతులు, బదిలీలు ఉం టాయని తెలిపారు. 5,500 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టుల మం జూరు, పండిట్, పిఇటి అప్‌గ్రేడేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని అన్నారు. 1998, 2008 డిఎస్‌సి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులకు ఉద్యోగాల కల్పన, ఎస్‌ఎస్‌ఎలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. వీటితో పాటే ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు, కెజిబివి టీచర్లకు బదిలీలు ఉంటాయని పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావులు తెలిపారు. ఈ సమావేశంలో ఎంఎల్‌సిలు కాటేపల్లి జనార్దన్ రెడ్డి, కూర రఘోత్తం రెడ్డి, వాణీదేవి, నర్సిరెడ్డి, మాజీ ఎంఎల్‌సి పూల రవీందర్లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News