Wednesday, January 22, 2025

141 మంది సిఐలకు డిఎస్పీలుగా పదోన్నతులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతున్నది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐ నుంచి సిఐ, డిఎస్‌పి నుంచి అడిషనల్ ఎస్‌పి, అడిషనల్ ఎస్‌పి నుంచి ఎస్‌పి ప్రమోషన్లు వచ్చాయి. ఇదే క్రమంలో సిఐ నుంచి డిఎస్‌పి ప్రమోషన్లు కూడా వచ్చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 141 మంది సిఐలకు డిఎస్‌పిలుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్రం హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిఎస్‌పిలుగా ప్రమోషన్లు పొందిన వారందరికీ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి డిజిపి అంజనీ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొత్తంగా కొంతకాలంగా ఎదురుచూస్తున్న సిఐల పదోన్నతుల కల నెరవేరింది. కాగా, ప్రమోషన్లు పొందిన 141 మంది సిఐలు 1996. 1998 బ్యాచ్‌కు చెందిన వారు కావడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News