Thursday, January 23, 2025

పెండింగ్ కేసులలో సత్వరమే పరిష్కారం

- Advertisement -
- Advertisement -

ములుగు: అండర్ ట్రయల్ కేసులు, పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గాష్ ఆలం అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నెలవారీ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ గాష్ ఆలం కీలక అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా అండర్ ట్రయల్ కేసులు, పెండింగ్ కేసులలో సత్వరమే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

ఫోక్సో కేసుల స్థితిగతులు, ఎన్‌డిపిఏ కేసుల పురోగతిపై చర్చించారు. రాబోయే శాసనసభ ఎన్నికల కోసం సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. సైబర్ నేరాలపట్ల అవగాహన ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లలో ప్రాథమిక అవసరాలు, మౌళిక సదుపాయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ అశోక్ కుమార్, డిసిఆర్బీ డిఎస్పీ సురేష్ బాబు, ఎస్బీ సిఐ శ్రీనివాస్, ములుగు, పస్రా, ఏటూర్ నాగారం, వెంకటాపురం సిఐలు మేకల రంజిత్ కుమార్, శంకర్, నాగరాజు, శివ ప్రసాద్, జిల్లాలోని ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News