ఐరోపా సొసైటీ మెడికల్ ఆంకాలజీ శాస్త్రవేత్తల వెల్లడి
లండన్ : సాధారణ ప్రజల కన్నా క్యాన్సర్ రోగులకు కొవిడ్ వ్యాక్సిన్లు సరైన రక్షణ కలిగించి సమర్ధంగా పనిచేస్తాయని పరిశోధకులు మంగళవారం తెలియచేశారు. మెడికల్ ఆంకాలజీకి (ఇఎస్‌ఎంఒ)కి సంబంధించి ఐరోపా సొసైటీ ప్రపంచ సమాజానికి వర్చువల్ ద్వారా ఈ వాస్తవ సాక్షాలను ప్రదర్శించింది. ఈ క్యాన్సర్ రోగులకు మూడో బూస్టర్ డోసు వ్యాక్సిన్ మరింత భద్రత స్థాయిని పెంపొందిస్తుందని వెల్లడించింది. పరిశోధకులు నెదర్లాండ్స్ లోని వివిధ ఆస్పత్రుల నుంచి 791 మంది రోగులను అధ్యయనం లోకి తీసుకుని నాలుగు వైవిధ్య గ్రూపులుగా విభజించి మోడెర్నా టీకా రెండు డోసులు ఇచ్చారు.
క్యాన్సర్ లేని రోగులు, ఇమ్యునో థెరపీ , కీమో థెరపీ, కీమో ఇమ్యునోథెరపీ పొందిన క్యాన్సర్ రోగులుగా వర్గీకరించి అధ్యయనం చేశారు. రెండో డోసు వేసిన 28 రోజుల తరువాత 84 శాతం కీమోథెరపీ రోగుల రక్తంలో , 89 శాతం కీమోఇమ్యునోథెరపీ రోగుల్లోను ఒక్క ఇమ్యునోథరెపీ పొందిన 93 శాతం రోగుల్లో సమృద్ధిగా యాంటీబాడీలు పెరగడాన్ని గుర్తించారు. క్యాన్సర్ లేని రోగులతో ఈ ఫలితాలను బేరీజు వేసి చూడగా దాదాపు 99.6 శాతం వరకు యాంటీబాడీల స్పందన కనిపించిందని యూరోపియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ (ఇటలీ) లంగ్ క్యాన్సర్ నిపుణుడు ఆంటోనియో పాస్సరో వెల్లడించారు.