Sunday, December 22, 2024

ఇంటి పన్ను వందశాతం వసూలు చేయాలి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్

- Advertisement -
- Advertisement -

 జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి: ఇంటి పన్నుల వసూలు 100 శాతం చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు…. మార్చి 31 లోపు వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని తెలిపారు. ఇప్పటివరకు 78 శాతం పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి 100 % లక్షాన్ని పూర్తి చేయాలని పేర్కొన్నారు.

మిషన్ అంత్యోదయ ఈ నెల 20 లోగా పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాల్లోని నర్సరీల్లో విత్తనాలు నాటాలని చెప్పారు. ప్రతి మంగళవారం, శుక్రవారం పొడి చెత్తను సేకరించాలని పేర్కొన్నారు. తడిచెత్తను సేకరించి గ్రామాల్లోని డంపింగ్ యార్డ్ వద్ద సేంద్రీయ ఎరువులు తయారు చేయాలని తెలిపారు. తయారు చేసిన సేంద్రీయ ఎరువులను రైతులకు విక్రయించి గ్రామపంచాయతీ ఆదాయాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. వైకుంఠదామాలలో నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.

ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంచే విదంగా చూడాలని కోరారు. గ్రామాలలో చేపట్టిన అభివృద్ది పనులు పరిశీలించి పల్లె ప్రగతి యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఆర్డిఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, జెడ్పిసీఈఓ సాయాగౌడ్, స్వచ్చభారత్ సమన్వయకర్త నారాయణ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News