Saturday, November 9, 2024

ముమ్మరంగా ఆస్తిపన్ను వసూలు

- Advertisement -
- Advertisement -

Property tax collection across Telangana

నెలాఖరులోగా రూ.861.65 కోట్ల వసూలుకు అధికారుల కార్యాచరణ
ప్రణాళికలు రూపొందించిన మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు

హైదరాబాద్: మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్‌లలో ఆస్తిపన్ను వసూలు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే రూ.560 కోట్లు వసూలు కాగా మార్చి ఆఖరు నాటికి మిగిలిన మొత్తాన్ని వసూలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే బకాయిదారుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దీంతోపాటు వాట్సాప్ ద్వారా వెసులుబాటు కల్పించారు. జిహెచ్‌ఎంసి మినహా మిగిలిన పట్టణాలు, నగరాల్లో అసెస్‌మెంట్ అయిన ఆస్తులు 20,22,171 ఉన్నాయి. వీటిపై ఈ ఏడాది రూ. 538.47 కోట్ల ఆస్తులు వసూలు కావాల్సి ఉండగా గతంలో బకాయిలు రూ. 230.22 కోట్లు ఉండగా వాటిపై రూ.93.158 కోట్లు జరిమానా విధించారు. అన్నీ కలిపి మొత్తం రూ.861.65 కోట్లు వసూలు కావాల్సి ఉంది. వాటిపై రూ.93.15 కోట్లు జరిమానా విధించారు.

అన్నీ కలిపి మొత్తం రూ. 861.85 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇందులో ఫిబ్రవరి 23 నాటికి రూ.518.68 కోట్లు వసూలయ్యాయని అధికారులు తెలిపారు. ఇంకా రూ.300 కోట్ల పైచిలుకు రావాల్సి ఉంది. ఇప్పటికే పన్నులు చెల్లించని బకాయిదారుల వివరాలను అధికారులు వెబ్‌సైట్‌లో ఉంచారు. ఆస్తిపన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే మున్సిపల్ కమిషనర్‌తో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాట్సాప్ ద్వారా ఆస్తిపన్ను వివరాలను తెలుసుకునేలా 90002533342 నెంబర్‌ను మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News