Sunday, April 13, 2025

జిహెచ్‌ఎంసిలో రికార్డుస్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు: కమిషనర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తిపన్ను విభాగంలోని అధికారులు, సిబ్బందిని కమిషనర్ ఇలంబర్తి సత్కరించారు. బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి రెవెన్యూ, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లును అభినందిస్తూ.. ప్రశంస పత్రాలు అందించారు. గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను చెల్లించిన ప్రతి పౌరుడికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పన్ను రూపేణ ప్రజలు చెల్లించిన ప్రతీ రూపాయిని అభివృద్ధి పనుల కోసమే ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.2వేల కోట్లు ఆస్తి పన్ను వసూలు కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఆస్తి పన్నుకు సంబంధించిన సమస్యలను ఆన్‌లైన్‌లో ఆరు నెలలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నగరంలో చేపట్టిన జిఐఎస్ సర్వే ద్వారా 9 లక్షల ఆస్తుల సర్వే పూర్తయిందని.. ఈ ఆర్థిక సంవత్సరం రూ.3 లక్షల కోట్ల ఆస్తి పన్ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News