Thursday, December 19, 2024

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో సైనిక స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కొత్త సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. అక్కడ పాఠశాలను నెలకొల్పేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సిఎం రేవంత్ ఇటీవల కలిసి వినతిపత్రం అందజేశారు. సైనిక్ స్కూల్‌ను మంజూరు చేయడంతోపాటు పాఠశాలకు అవసరమైన 50 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించాలని, అందుకు బదులుగా వేరే చోట రక్షణ శాఖకు స్థలం ఇస్తామని మంత్రి వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం.

కేంద్రం కూడా సుముఖంగా ఉండటంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విద్యాశాఖ అధికారులతో చర్చించారు. పూర్తిస్థాయి గురుకులం తరహాలోనే కొత్త సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు కేంద్రానికి సమర్పించేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఆరేళ్ల క్రితం వరంగల్‌కు సైనిక్ స్కూల్ మంజూరు కాగా ఆనాడు స్థలం కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు అది ఇంకా పెరగొచ్చని భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News