గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్యానికి రూపాయి చొప్పున పెంపు
ఎస్‌సి, ఎస్‌టిలకు 101 యూనిట్ల వరకు ఉచితం
వ్యవసాయానికి యథావిధిగా కరెంట్ ఫ్రీ
షాపులు, ధోబీఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచితం
ఈఆర్‌సికి విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలు అందజేసిన
డిస్కంలు త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్న
ఈఆర్‌సి ఛార్జీల పెంపుతో డిస్కంలకు సమకూరనున్న
రూ.6831 ఆదాయం
మనతెలంగాణ/హైదరాబాద్: ఛార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ అథారిటీకి డిస్కంలు అందజేశాయి. గృహ వినియోగదారులకు 50 పైస లు (యూనిట్‌కు), వాణిజ్య వినియోగదా రులకు (యూనిట్‌కు) రూపాయి చొప్పున పెంచాలనిప్రతిపాదించాయి. ఈ నేపథ్యం లోనే కరెంట్ ఛార్జీలకు సంబంధించి డి స్కంలు ఈఆర్‌సికి సాయం త్రం టారిఫ్‌లను సమర్పించాయి. అనంత రం టిఎస్‌ఎస్‌పిడిఎసి ఎల్ సిఎండి రఘు మారెడ్డి, టిఎస్‌ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపా ల్‌రావులు విలేకరుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా సిఎండి రఘు మారెడ్డి మాట్లాడుతూ 202223 సంవ త్సరానికి సంబంధించి రూ.10,928 కోట్ల ఆర్థికలోటును పూడ్చడానికి విద్యుత్ ఛార్జీ లను పెంచక తెలిపారు. 202223 ఆర్థిక సంవత్సరానికి డిస్కంల ఆదాయ అవసరాలు రూ.53,054 కోట్లు ఉండగా, ఆదాయం రూ.42,126 కోట్లు కాగా, సబ్సిడీ పోనూ రూ.10,928 కోట్ల లోటును ఏర్పడుతుందని దీనివల్ల చార్జీల పెంపు అనివార్యమన్నారు.
రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం అయ్యిందన్నారు. 5 సంవత్సరాలుగా చార్జీలను పెంచలేదని, కానీ, ఇప్పుడు చార్జీలను పెంచక తప్పడం లేదన్నారు. 20 సంవత్సరాల తర్వాత 50 యూనిట్లలోపు ఛార్జీలను సైతం పెంచుతున్నామన్నారు. ఐదు సంవత్సరాలుగా టారిఫ్ రివిజన్ చేయలేదన్నారు. గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50పైసలు, కమర్షియల్ వినియోగదారులకు యూనిట్‌కు రూపాయి పెంచాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఎల్‌టి (డొమెస్టిక్) కనెక్షన్‌ల పై యూనిట్ కు రూ.50పైసలు పెంపు వలన రూ.2,110 కోట్లు ఆదాయం వస్తుందని తెలిపారు.హెచ్‌టి కనెక్షన్‌లపై యూనిట్‌కు రూ.1 పెంపు ద్వారా రూ.4,721కోట్లు ఆదాయం లభిస్తుందన్నారు. చార్జీల పెంపుతో సుమారుగా రూ.6,831 కోట్ల అదనపు ఆదాయం డిస్కంలకు లభిస్తుందన్నారు.
డోమెస్టిక్ వినియోగదారులు కోటి యాభై నాలుగు లక్షల మంది
రాష్ట్రంలో డోమెస్టిక్ వినియోగదారులు కోటి యాభై నాలుగు లక్షల మంది, కమర్షియల్ 13,27,494 మంది, ఎల్‌టి ఇండస్ట్రీయల్ వినియోగదారులు 66,519, ఎల్‌టి కాటేజీ 10,419 మంది, అగ్రికల్చర్ 25,78,000ల మంది రైతులు, హెచ్‌పి ఇండస్ట్రీయల్ 7,756 మంది, హెచ్‌పి కమర్షియల్ 4,509 మంది, హెచ్‌టి 13,715 మంది వినియోగదారులు ఉన్నారని డిస్కంల సిఎండిలు తెలిపారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని దీనిని ప్రస్తుతం అలాగే కొనసాగిస్తామని దీనివల్ల 25 లక్షల 78 వేల మంది లబ్ధిపొందుతున్నారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం 2014- నుంచి 2021 సంవత్సరం వరకు రూ. 25,467 కోట్ల సబ్సిడీని భరించిందని తెలిపారు.
రాష్ట్రంలో 5,00,771 మంది ఎస్సీ, 2,69,983 మంది ఎస్టీలకు 101 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచిత విద్యుత్‌ను విద్యుత్‌ను కొనసాగిస్తామన్నారు. వీరితో పాటు 22,849 మంది సెలూన్ షాపులకు, 30,220 దోబీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. 5,894 కోళ్ల ఫారాలకు, 4,920 పవర్‌లూంలకు యూనిట్ విద్యుత్‌పై రూ.2 చొప్పున రాయితీల్లో ఎలాంటి మార్పలేదని వాటిని అలాగే కొనసాగిస్తామని సిఎండి తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ విద్యుత్ సంస్థల్లో 23,667 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు వారికి జీతభత్యాలను గణనీయంగా పెంచామని తెలిపారు.
50 యూనిట్ల లోపు గృహ వినియోగదారుల నుంచి రూ.1.45 పైసలు
ప్రస్తుతం 0 నుంచి 50 యూనిట్ల లోపు ఎల్‌టి1 గృహ వినియోగదారుల నుంచి (రూ.1.45 పైసల) చార్జీలను డిస్కంలు వసూలు చేస్తున్నాయి. 51 నుంచి 100 యూనిట్ల లోపు వినియోగదారుల నుంచి (రూ.2.60 పైసలు), 0 నుంచి 100 యూనిట్ల లోపు వినియోగదారుల నుంచి (రూ.3.30 పైసలు), 101 నుంచి 200 యూనిట్ల లోపు వినియోగదారుల నుంచి (రూ.4.30 పైసలు), 0 నుంచి 200 యూనిట్ల లోపు వినియోగదారుల నుంచి (రూ.5.00లు), 201 నుంచి 300 యూనిట్ల లోపు వినియోగదారుల నుంచి (రూ.7.20 పైసలు), 301 నుంచి 400 యూనిట్ల లోపు వినియోగదారుల నుంచి (రూ.8.50 పైసలు),401 నుంచి 800 యూనిట్ల లోపు వినియోగదారుల నుంచి (రూ.9లు), 800 యూనిట్లపై బడిన వినయోగదారుల నుంచి (రూ.8.50 పైసలు) ప్రస్తుతం డిస్కంలు వసూలు చేస్తున్నాయి.
కమర్షియల్ వినియోగదారుల నుంచి 0 నుంచి 50 యూనిట్ల లోపు…
ఎల్‌టి 2 కమర్షియల్ వినియోగదారుల నుంచి 0 నుంచి 50 యూనిట్ల లోపు కిలోవాట్స్‌కు (రూ.6లు), 0 నుంచి 100 యూనిట్లు పైబడిన వారి నుంచి కిలోవాట్‌కు (రూ.7.50 పైసలు), 101 నుంచి 300ల యూనిట్ల లోపు వినియోగదారుల నుంచి కిలోవాట్స్‌కు (రూ.8.90 పైసలు), 301 నుంచి 500ల యూనిట్ల లోపు వినియోగదారుల నుంచి కిలోవాట్స్‌కు (రూ.9.40 పైసలు), 500ల యూనిట్లు దాటిన వినియోగదారుల నుంచి కిలోవాట్స్‌కు (రూ.10లు) వసూలు చేస్తున్నారు.