Wednesday, November 20, 2024

వ్యభిచారం నిర్వహిస్తున్న హోటల్‌పై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

Prostitution racket busted in hyderabad

హైదరాబాద్: నగరంలోని వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ హోటల్‌పై యాంటి ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు శనివారం దాడి చేశారు. హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న మేనేజర్, ముగ్గురు సిబ్బంది, ముగ్గురు యువతులను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు. నగరంలోని చిక్కడపల్లిలోని సాయికృప హోటల్‌లో మరమ్మత్తులు నిర్వహిస్తున్నామని చెప్పి మూసివేశారు. అయితే మరమ్మతుల ముసుగులో నిర్వాహకులు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో యాంటి ఉమెన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Prostitution racket busted in hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News