Monday, January 20, 2025

స్పా ముసుగులో వ్యభిచారం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న హైదరాబాద్‌లోని రెండు స్పాలపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో స్పాల నిర్వాహకులు, విటులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… బంజారాహిల్స్‌లో రోడ్డు నంబర్ 12లోని ఉన్న స్పా సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.

వెంటనే స్పా సెంటర్‌లో పోలీసులు దాడులు చేయగా స్పా నిర్వాహకుడు, విటులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పలువురు సంపన్నుల కుమారులు ఉన్నట్లు తెలిసింది. స్పా సహనిర్వాహకుడు సయ్యద్ బిల్లాల్, ఫహద్, హసీదుద్దిన్, మహ్మద్ ఇమ్రానంద్, కమల్ కిషోర్‌ను అరెస్టు చేశారు. యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నగరానికి తీసుకుని వచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

కాగా బంజారాహిల్స్, రోడ్డు నంబర్ 10లోని మహి ఆయుర్కేదిక్ బ్యూటీ స్పా సెలూన్‌పై పోలీసులు దాడులు చేశారు. స్పా నిర్వహకుడు స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. స్పాలో క్రాస్ మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుర్తించారు. క్రాస్ మసాజ్ పేరుతో వివిధ ప్రాంతాల నుంచి యువతుల నుంచి రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. సునీల్‌కుమార్, ఫర్జానా బేగంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News