బర్మా, బంగ్లాదేశ్‌ల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న అంశంపై ఎన్‌ఐఎ, సిఐ సెల్ రంగంలోకి దిగాయి. పిటి వారంట్‌పై నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఎన్‌ఐఎ, సిఐ సెల్ రహస్య ప్రాంతంలో ఆరుగురు నిందితులను ప్రశ్నిసు ్తన్నారు. దీంతో ఈ కేసులో పూర్తిస్థాయిలో డొంక కదలనుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్, బర్మా నుంచి దేశంలోకి ఎలా వచ్చారనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వారికి ఇక్కడ ఎవరు ఆశ్రయం ఇచ్చారు? వారు ఇక్కడ ఆధార్ కార్డు ఎలా పొందారు? అన్న అంశాలపై వివరాలు సేకరణ జరుగుతుంది. కాగా ఈ విచారణలో సోమవారంతో ఆరుగురి కస్టడీ ముగియనుంది. దీంతో పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి. కాగా, ఫిబ్రవరి 26న హైదరాబాద్ కమీషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ టీమ్, చాదర్‌ఘాట్, ఖైరతాబాద్ పోలీసులు ఏకకాలంలో చాదర్‌ఘాట్, ఖైరతా బాద్ లోని అక్రమ వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి (18) అక్రమ వలసదారులను అరెస్టు చేశారు.
వీరంతా పశ్చిమ బెంగాల్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అయితే వారు నకిలీ పేర్లు పెట్టుకొని నగరంలో చలామణి అవుతూ సెక్స్ రాకెట్ కొనసాగిస్తున్నట్లు నిర్ధారించిన అధికారు లు విచారణ ప్రారంభించారు. దీంతో పోలీసుల విచారణలో సెక్స్ రాకెట్‌లోకి మహిళల బలవంతపు అమ్మకాల విషయం బయట పడిం ది. ప్రధాన నింధితులుగా ఉన్న ఆరుగురుని ప్రశ్నించగా బర్మా, బంగ్లాదేశ్ ల నుంచి అమ్మా యిలను తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయం చేసి నట్లు తేల్చారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరం అక్రమ వలసదారులకు నిలయంగా మారిందని, పాతబస్తీలో బంగ్లాదేశ్ రోహింగ్యాలకు నివా సం కల్పిస్తున్నారని, వారి వల్ల అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ పలుమార్లు బహిరంగ వేదికల్లో ఆరోపించారు.తాజా పరిణామాలతో ఆయన వ్యాఖ్యలకు బలం చేకూరుతుంది.